Friday, April 4, 2025

జక్కన్న వదిలిన ‘ఘోస్ట్’ ఎలక్ట్రి‌ఫైయింగ్ ట్రైలర్

కరుణడ చక్రవర్తి డా శివరాజ్ కుమార్ హీరోగా పాన్ ఇండియా యాక్షన్ స్పెక్టకిల్ గా రూపొందుతోన్న చిత్రం ‘ఘోస్ట్’. దర్శకుడు శ్రీని ఘోస్ట్ చిత్రాన్ని యాక్షన్ ఫీస్ట్ గా తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ రాజకీయనాయకులు, నిర్మాత సందేశ్ నాగరాజ్ తన సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఘోస్ట్ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అక్టోబర్ 19న దసరా కానుకగా కన్నడ, తెలుగు, తమిళ, హిందీ, మలయాళం భాషల్లో భారీ స్థాయిలో విడుదలకి సిద్ధమవుతుంది.

అక్టోబర్ 1న చిత్ర బృందం ఘోస్ట్ చిత్ర ట్రైలర్ ను విడుదల చేసింది. ఏస్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి తెలుగు ట్రైలర్ ను తన సోషల్ మీడియా మాధ్యమాల్లో విడుదల చేశారు. ట్రైలర్ ఆద్యంతం హై ఓల్టేజ్ యాక్షన్ తో ట్రే మెండస్ బిజీఎం తో రొమాంచితంగా ఉంది. ట్రైలర్ ఇంతక ముందెన్నడూ చూడని యాక్షన్ తో ఒక కొత్త ప్రపంచం లోకి తీసుకెళుతుంది. శివ రాజ్ కుమార్ హైలైట్ స్క్రీన్ ప్రెజెన్స్ కి తోడు దర్శకుడు శ్రీని తనదైన విజన్ తో హీరోయిజం నీ నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళారు.
‘‘నేను నార్మల్ గా ఎవరి జోలికి వెళ్ళను ఒడిపోతాననే భయం కాదు….
నేను వెళితే రణరంగం మారణహోమంగా మారుతుంది..’’
అనే డైలాగ్ శివ రాజ్ కుమార్ పాత్ర ఎంత పవర్ఫుల్ గా తెరకెక్కించారో చెప్తోంది. సంగీత దర్శకుడు అర్జున్ జన్య అందించిన సంగీతం యాక్షన్ సీన్స్ ను మరో స్థాయికి తీసుకెళ్లింది. వింటేజ్ శివన్న యంగ్ గా కనబడే షాట్స్ ఫ్యాన్స్ కి ఫీస్ట్ గా ఉండనున్నాయి. ట్రైలర్ ఘోస్ట్ మీద ఉన్న అంచనాలను తారాస్థాయికి తీసుకెళ్లింది.

హిందీ కి సంభందించి ఘోస్ట్ చిత్ర హక్కులన్నింటినీ ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ జయంతీ లాల్ గడ భారీ మొత్తానికి కొనుగోలు చేయడం సినిమా మీద ఉన్న క్రేజ్ ను సూచిస్తోంది. ప్రముఖ నటులు అనుపమ్ ఖేర్, జయరామ్, ప్రశాంత్ నారాయణ్, అర్చన జాయిస్, సత్య ప్రకాష్, దత్తన్న ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు. ‘ఘోస్ట్’ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. మస్తీ, ప్రసన్న వి ఎం డైలాగ్స్ రాస్తున్నారు. మోహన్ బి కేరే ప్రొడక్షన్ డిజైనర్ గా పనిచేస్తున్నారు. పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ జన్య సంగీతాన్ని అందిస్తున్నారు. కన్నడ లో టాప్ స్టార్స్, టెక్నీషియన్స్ తో చిత్రాలు తీసే సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత సందేశ్ నాగరాజ్ ‘ఘోస్ట్’ ని లావిష్ స్కేల్ లో ప్రొడ్యూస్ చేస్తున్నారు. కన్నడ, తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం భాషల్లో ఘోస్ట్ దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకి రానుంది.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Most Voted
Newest Oldest
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

2,894FansLike
4,583FollowersFollow
8,907FollowersFollow
3,457FollowersFollow
2,267FollowersFollow
6,786SubscribersSubscribe
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x