Friday, April 4, 2025

తమిళ రాజకీయాల్లో సంచలనం.. చిన్నమ్మ షాకింగ్ నిర్ణయం

తమిళనాట రాజకీయాల్లో షాకింగ్ ఘటన. అసెంబ్లీ ఎన్నికలకు ముందు చిన్నమ్మ శశికళ అందరికీ షాకిచ్చే సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాలు, ప్రజా జీవితానికి వీడ్కోలు చెప్తున్నట్లు ప్రకటించారు. తాను రాజకీయాల్లోకి రాబోనని స్పష్టం చేసేశారు. తనకు పదవుల మీద, అధికారం మీద మొదటి నుంచి ఎలాంటి ఆసక్తి లేదని తేల్చి చెప్పారు. అమ్మ జయలలిత అభిమానులు అందరూ ఏకమై డీఎంకేను ఓడించాలని శశికళ పిలుపునిచ్చారు. ఇటీవల శశికళ జైలు నుంచి విడుదలవడం, అదే సమయంలో తమిళనాట అసెంబ్లీ ఎన్నికల త్వరలోనే ఉండటంతో ఇక్కడి రాజకీయాల్లో చిన్నమ్మ పాత్ర ఎలా ఉంటుందని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈ విషయంలో ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున ఊహాగానాలు కూడా చక్కర్లు కొట్టాయి. అన్నాడీఎంకేను మళ్లీ ఆమె కైవసం చేసుకుంటారని, ఆమే రాజకీయాల్లో చక్రం తిప్పుతారని వార్తలు కూడా వినిపించాయి.

శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ సొంతంగా ఏఎంఎం‌కే పార్టీ పెట్టిన సంగతి తెలిసిందే. ఆయన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత జయలలిత పోటీ చేసిన ఆర్కే నగర్ నియోజకవర్గం నుంచే ఉప ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. అవినీతి కేసులో జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత చిన్నమ్మే ఈ పార్టీని ముందుండి నడిపిస్తారని, అన్నాడీఎంకే నుంచి పెద్ద ఎత్తున వలసలు ఉంటాయని చాలా మంది భావించారు.

ఏఎంఎంకే పార్టీని కూడా అన్నాడీఎంకేలో విలీనం చేసుకోవాలంటూ కేంద్రంలోని అధికార పార్టీ నుంచి ఒత్తిళ్లు వచ్చాయని కూడా గుసగుసలు వినిపించాయి. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, ఆ పార్టీ జనరల్ సెక్రటరీ పన్నీర్ సెల్వం మీద ఈ విషయంలో బీజేపీ ఒత్తిడి చేసినట్టు ప్రచారం జరిగింది. ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో వీళ్లు సమావేశం అయ్యారు. ఆ సమయంలోనే తమిళనాట అన్నాడీఎంకే – బీజేపీ కూటమి గెలుపు కోసం చిన్నమ్మ పార్టీని కూడా విలీనం చేసుకోవాలని అమిత్ షా గట్టిగా చెప్పారనే ప్రచారం సాగింది.

అయితే, ఈ వార్తలను తమిళనాడు మంత్రి జయకుమార్ ఖండించారు. ‘మాపై ఎవరూ ఒత్తిడి తీసుకురాలేదు. పార్టీ అంతర్గత విషయాల్లో బీజేపీ జోక్యం చేసుకోవడం జరగదు. ఇంతకు ముందే సీఎం చెప్పినట్టు ఏఎంఎంకే పార్టీని అన్నాడీఎంకేలో విలీనం చేసుకునే అవకాశం ఎంత మాత్రమూ లేదు. ఇది మా కచ్చితమైన నిర్ణయం. అమిత్ షాతో సమావేశంలో విలీనం గురించి చర్చించినట్టు మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాదు. ఏఎంఎంకేలో గుంటనక్కలు ఉన్నాయి. అన్నాడీఎంకేలో సింహాలు ఉన్నాయి. అలాగే అన్నాడీఎంకే, బీజేపీ మధ్య సీట్ల సర్దుబాటు కూడా సుజావుగా జరుగుతుంది. దీనిపై త్వరలోనే ఓ నిర్ణయానికి వస్తాం.’ అని జయకుమార్ స్పష్టంగా చెప్పారు.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Most Voted
Newest Oldest
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

2,894FansLike
4,583FollowersFollow
8,907FollowersFollow
3,457FollowersFollow
2,267FollowersFollow
6,786SubscribersSubscribe
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x