సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న చిత్రం సర్కారు వారి పాట. ఈ మధ్యే ఈ చిత్రం దుబాయ్ లో మొదటి షెడ్యూల్ ని పూర్తి చేసుకుని, రెండవ షెడ్యూల్ షూటింగ్ ని జరుపుకుంటుంది. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మహానటి కీర్తి సురేష్ మహేష్ పక్కన జోడిగా నటిస్తోంది. ఇందులో మహేష్ కొత్త లుక్ తో దర్శనం ఇవ్వబోతున్నాడు. కాగా ఈ చిత్రం బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న మోసాలపై చిత్రీకరించబడుతుందనే విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా ఈ చిత్రం తరువాత మహేష్ ఎవరితో సినిమా చేస్తాడా? అని టాలీవుడ్‌లో ఒకటే చర్చలు నడుస్తున్నాయి. కానీ మహేష్ ఓ భారీ సినిమా చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. దానికి సంబంధించి పలువురు దర్శకుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు వాటిపై ఎటువంటి క్లారిటీ రాలేదు. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు పాన్ ఇండియా సినిమాలపై మొగ్గు చూపుతుండడంతో, మహేష్ కూడా ఓ భారీ పాన్ ఇండియా చిత్రంలో నటించనున్నాడని టాక్ నడుస్తోంది. అయితే ఈ సినిమాలో అతిలోక సుందరి కుమార్తె జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుందని, ప్రముఖ బాలీవుడ్ నిర్మాత ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారని అంటున్నారు.
అయితే రాజమౌళి ఓ వేదికపై మహేష్ తో సినిమా ఉంటుందని అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. దాంతో ఆర్ ఆర్ ఆర్ తరువాత రాజమౌళి, మహేష్ ల కాంబినేషన్ లో సినిమా ఉంటుందని అభిమానులంతా ఎదురు చూస్తున్నారు. దీనిపై రాజమౌళి తండ్రి ఒక చిన్న హింట్ కూడా ఇచ్చాడు. మహేష్ సినిమా కథ ఆఫ్రికా అడవికి సంబంధించి ఉంటుందని ఆయన చెప్పారు. అయితే సర్కారు వారి పాట తర్వాత మహేష్ చేసే సినిమా రాజమౌళితోనా, లేదంటే బాలీవుడ్ నిర్మాత తీసే పాన్ ఇండియా సినిమానా అనేది తెలియాల్సిఉంది.