Friday, October 18, 2024

డ్రైవర్‌ లేని ట్రాక్టర్.. శభాష్ అంటున్న అన్నదాతలు!

ట్రాక్టర్ అనగానే మనకు గుర్తొచ్చేది రైతులే. అయితే ట్రాక్టర్ నడపే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వెనకాల ట్రాలీ ఉంటే.. మరింత జాగ్రత్తగా నడపాలి. లేదంటే ప్రమాదాలు జరిగే అవకాశాలు చాలా ఎక్కువ. అలాంటిది… అసలు డ్రైవర్‌తో పనే లేకుండా ట్రాక్టర్ దానంతట అదే నడిస్తే? ఇక రైతుకు అంత కంటే హాయి ఏముంటుంది చెప్పండి. పొలంలో ట్రాక్టర్‌తో దుక్కి దున్నడం వల్ల రైతులకు నడుము నొప్పి వస్తూ ఉంటుంది. ఇది శతాబ్దాలుగా రైతులకు ఎదురవుతున్న అతి పెద్ద సమస్య. ట్రాక్టర్‌పై రైతు కూర్చోవాల్సిన పని లేకుండా.. ట్రాక్టర్ దానంతట అదే దుక్కి దున్నేస్తే? ఎలా ఉంటుంది అని ఆలోచన వచ్చిందో యువకుడికి.

అంతే ఏవేవో ప్రయోగాలు చేసేసి చివరకు తన ప్లాన సక్సెస్ చేసుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్‌కి చెందిన ఈ 19 ఏళ్ల యువ రైతు.. బారో సిటీలో నివసిస్తున్న యోగేష్‌కు ట్రాక్టర్ నడపడం ఎంత కష్టమో తెలుసు. అందుకే డ్రైవర్ లేకుండా నడిచే ట్రాక్టర్ తయారు చేయాలని కలలు కనేవాడు. చివరకు ఓ మామూలు ట్రాక్టర్‌లో మార్పులు చేసి తన కలను నిజం చేసుకున్నాడు.

బీఎస్సీ మొదటి సంవత్సరం చదువుతున్న యోగేష్‌కి ఓ రోజు కాల్ వచ్చింది. “నాన్నకు ఆరోగ్యం బాలేదు… అర్జెంటుగా నువ్వు ఊరికి రా” అన్నది దాని సారాశం. హడావుడిగా ఊరెళ్లాక, ఒకవైపు తండ్రిని జాగ్రత్తగా చూసుకుంటూ.. మరోవైపు పొలం పనులు చెయ్యాల్సి వచ్చింది. దాదాపు 2 నెలలపాటూ ట్రాక్టర్‌తో పనులు చేశాడు. దానిలో ఉన్న కష్టం అర్థమైంది. అప్పుడే అతనికి ఓ ఆలోచన వచ్చింది. మనం డ్రైవర్ లెస్ కార్లను చూస్తున్నాం కదా, మరి అలాంటప్పుడు డ్రైవర్ లెస్ ట్రాక్టర్ ఎందుకు ఉండకూడదు అనేదే ఆ ఆలోచన. తనకు ఎదురైన రకరకాల సమస్యలను ఓపికతో అధిగమించి చివరకు.. రిమోట్ కంట్రోల్‌తో నడిచే ట్రాక్టర్‌ను సృష్టించాడు.

తన ఉద్దేశాన్ని తండ్రికి చెప్పిన యోగేష్.. తొలి ప్రయోగం కోసం 2000 రూపాయలు అడిగాడు. అప్పుడు ఆయన సరే అంటూ రూ.2000 ఇచ్చాడు. అసలు ఇది ఎలా పనిచేస్తుందో ముందు చూపించు అన్నాడు. ‘‘నువ్వు చెప్పింది సాధ్యమే అని అనిపిస్తే. అప్పుడు కావాలంటే మరింత డబ్బు ఇస్తాను’’ అని హామీ కూడా ఇచ్చేశాడు. దాంతో రూ.2వేలు పెట్టి కొన్ని పరికరాలు కొనుక్కున్న యోగేష్.. వాటితో ట్రాక్టర్‌ను ముందుకూ, వెనక్కూ రిమోట్‌తో కదిలించి చూపించాడు.

అప్పుడు యోగేష్ అనుకున్నది సాధిస్తాడని నమ్మిన అతని తండ్రి.. బంధువుల దగ్గర అప్పుచేసి మరీ రూ.50,000 ఇచ్చాడు. దాంతో యోగేష్ పూర్తి స్థాయి పరికరాలతో.. మంచి రిమోట్ కంట్రోల్ తయారుచేసుకొని ట్రాక్టర్‌ను అన్ని రకాలుగా రిమోట్‌తో నడిచేలా తయారు చేశాడు. ఈ ట్రాక్టర్‌ని చూసిన స్థానికులు, రైతులు శభాష్ అంటూ యోగేష్‌ను మెచ్చుకుంటున్నారు.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

2,894FansLike
4,583FollowersFollow
8,907FollowersFollow
3,457FollowersFollow
2,267FollowersFollow
6,786SubscribersSubscribe
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x