Friday, April 4, 2025

న్యూడ్ ఫొటో అడిగిన నెటిజన్‌కు.. చెంప పగిలేలా ప్రియమణి ఆన్సర్

ఈ మధ్య సోషల్ మీడియాలో చాట్ చేసే హీరోయిన్లను.. నెటిజన్లు ఇరిటేట్ చేసే ప్రశ్నతో వేధిస్తున్నారు. నిజంగా అటువంటి ప్రశ్న అడిగే ముందు వారి కుటుంబంలో కూడా ఆడవాళ్లు ఉన్నారని ఎందుకు భావించరో తెలియదు కానీ.. ఎంత సెలబ్రిటీ అయినా లెక్కచేయకుండా నెటిజన్లు.. పబ్లిక్‌గా అలాంటి ప్రశ్నలు అడిగి.. వారి స్థాయిని దిగజార్చుకుంటున్నారు. ఇంతకీ నెటిజన్లు అడిగే ఆ ఇరిటేట్ ప్రశ్న ఏమిటని అనుకుంటున్నారా? మీ న్యూడ్ ఫొటో ఒకటి షేర్ చేయవచ్చుగా..?. అటువైపు ఉన్నవారు ఎలాంటి సెలబ్రిటీ అయినా సరే.. నెటిజన్లు మాత్రం ఈ ప్రశ్న అడగకుండా మాత్రం ఉండటం లేదు. దీనికి వారు కూడా చెంప పగిలేలా సమాధానం ఇస్తున్నారనుకోండి. అదే వేరే విషయం.

అయినా.. అటువంటి ప్రశ్నలు అడగకూడదని.. మనిషిగా పుట్టిన వ్యక్తికి లేకపోవడం విడ్డూరం. న్యూడ్ ఫొటో పోస్ట్ చేయడానికి వారేం పోర్న్ సెలబ్రిటీలు కాదు. పోర్న్ సెలబ్రిటీలే వారి వృత్తిపరంగా అలా ఉంటారు తప్ప.. పబ్లిక్ ప్లేస్‌లో మాత్రం వారు పద్ధతిగానే ఉంటారు. ఉదాహరణకు సన్నీలియోన్ ఒకప్పుడు వృత్తి వేరు. ఆ వృత్తి కోసం ఆమె చేసింది వేరు. ఇప్పుడు ఆమె ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తుంది అంటే అతిశయోక్తి కానే కాదు. పిల్లలను అడాప్ట్ చేసుకుని.. సొంత పిల్లలకంటే ఎక్కువగా వారిని సాకుతుంది. వారిని చూస్తే చేతులెత్తి దణ్ణం పెట్టాలనిపించేంతగా.. ఇప్పుడు ఆమె జీవితాన్ని కొనసాగిస్తుంది.

మరి అలాంటిది ప్రియమణి వంటి ఓ సెలబ్రిటీని పబ్లిక్‌గా ఓ నెటిజన్ ప్లీజ్ మీ న్యూడ్ ఫొటోని పోస్ట్ చేయండి అంటూ కోరాడు. దీనికి మరొకరైతే.. వెంటనే తన సోషల్ మీడియా అకౌంట్‌ని క్లోజ్ చేసి.. ఈ చెత్త వెధవలతో మనకెందుకులే అని కామ్‌గా ఉండేవారు. కానీ ప్రియమణి చాలా మెచ్యూరిటీగా సమాధానం ఇచ్చింది. ఇంకా చెప్పాలంటే చెంప పగిలేలా ఆన్సర్ ఇచ్చింది. దెబ్బకి నెటిజన్‌లో మార్పు వచ్చి.. రెండు చేతులెత్తి సారీ చెప్పేశాడంటే.. ప్రియమణి ఆన్సర్ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ‘‘ముందు మీ అమ్మనో.. లేదంటే మీ చెల్లినో.. ఈ ప్రశ్న అడగండి. వాళ్లు షేర్ చేస్తే.. నేను కూడా తప్పకుండా పోస్ట్ చేస్తా..’’ అని ప్రియమణి సమాధానమిచ్చింది. దీంతో.. దిమ్మతిరిగిన నెటిజన్ వెంటనే ప్రియమణిని క్షమాపణలు కోరాడు. ప్రియమణి ఆన్సర్ చూసిన వాళ్లంతా.. ఇప్పుడామెపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. అది మ్యాటర్.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Most Voted
Newest Oldest
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

2,894FansLike
4,583FollowersFollow
8,907FollowersFollow
3,457FollowersFollow
2,267FollowersFollow
6,786SubscribersSubscribe
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x