మంచి బ్రాడ్ బ్యాండ్‌తో నెట్ కనెక్షన్ ఉన్నా.. వైఫై విషయానికి వస్తే.. స్పీడ్ చాలా స్లోగా ఉంటుంది. ఇది ప్రస్తుతం ఎందరో ఫేస్ చేస్తున్న సమస్య. పేరుకేమో బ్రాండ్.. నెట్ చూస్తే మాత్రం మరీ చీప్‌గా వస్తుండటంతో.. వెంటనే మార్చాలని అంతా అనుకుంటూ ఉంటారు. అయితే వైఫై వేగాన్ని బ్రాడ్ బ్యాండ్ మార్చకుండా కూడా పెంచుకునే అవకాశాలున్నాయి. అవేంటో తెలుసుకుంటే చాలు.. ఈజీగా వైఫై స్పీడ్‌ను సెట్ చేసుకోవచ్చు. మరి అవేంటో తెలుసుకుందామా..
– మొదట చేయాల్సింది ఏమిటంటే వైఫైకు కనెక్ట్ అయి ఉన్న ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను డిస్ కనెక్ట్ చేసుకోవాలి. వైఫై రూటర్ పక్కన ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు అలాగే ఐరన్‌కు చెందిన వస్తువులు లేకుండా చూసుకోవాలి.
– కొన్ని ప్రదేశాలలో నిలబడినప్పుడు, లేదంటే.. రూటర్‌కి దగ్గరగా ఉన్నప్పుడు మాత్రమే సిగ్నల్ వస్తుంటే.. వైఫై రూటర్ ఉన్న స్థానాన్ని సరైన ప్రదేశంలో సెట్ చేసుకోవాలి. ఇంటికి మధ్యలో ఉండే ప్రదేశం అయితే చాలా బెటర్.
– ఒక్కోసారి రూటర్‌కి ఉంటే అడాప్టర్ లేదంటే ప్లగ్ కూడా ఖరాబై ఉండవచ్చు. వాటిని కూడా చెక్ చేసుకోవాలి.
– కొన్నిసార్లు షాపుల్లో ఇది చాలా మంచి రూటర్ అని షాపు వాళ్లు మనకి అంటగడుతుంటారు. అలా కాకుండా రూటర్ విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. డ్యూయల్ బ్యాండ్ 2.4 గిగాహెర్ట్జ్ నుంచి 5 గిగాహెర్ట్జ్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ గల రూటర్‌ని ప్రయారిటీని బట్టి తీసుకుంటే మంచిది.
– నెట్ వేగాన్ని చూసుకునేందుకు స్పీడ్ టెస్ట్. నెట్, ఫాస్ట్. కామ్ వంటి వాటిలో చూసుకోవచ్చు.
-రూటర్‌కు ఎక్కువగా సిగ్నల్స్ అంటే.. ఇతర నెట్ వర్క్ సిగ్నల్స్ కూడా వస్తూ ఉంటే.. ఆ సిగ్నల్స్ రూటర్‌పై ప్రభావం చూపుతాయి. అలాంటి ప్రాబ్లమ్ ఉన్నప్పుడు రూటర్‌లో ఛానల్ ఎంపిక మోడ్ సెట్ చేసుకోవాలి.
– రూటర్ యాంటిన్నా పొజిషన్ విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. యాంటిన్నా స్థానం మార్చినప్పుడు కూడా స్పీడ్‌లో మార్పులుంటాయి.
ఇవన్నీ చేసినా కూడా స్పీడ్‌లో ఎటువంటి మార్పు రాకుంటే.. రూటర్‌ని మార్చడమో లేదంటే.. మరో కొత్త నెట్ కనెక్షన్ తీసుకోవడమో చేస్తే బెటర్.