pakka commercial: డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో వచ్చిన‘ప్రతిరోజు పండగే’ ఎటువంటి సక్సెస్‌ను అందుకుందో తెలిసిందే. మరి ఈ చిత్ర బ్లాక్ బస్టర్ సక్సెస్ తరువాత దర్శకుడు మారుతి చేయబోయే సినిమాపై అంతటా ఆసక్తి నెలకొంది. లాక్‌డౌన్‌లో కూడా మారుతి తదుపరి చిత్రం గురించి కొన్ని వార్తలు రావడం, వాటిని మారుతి ఖండించడం వంటివి జరుగుతూ వచ్చాయి. ఇక మారుతి తదుపరి సినిమాపై ఉన్న ఉత్కంఠకి తెరదించుతూ ఇటీవలే మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో సక్సెస్ ఫుల్ బ్యానర్లుగా అందరి మన్ననలు అందుకుంటూ ముందుకు సాగుతున్న జీఏ2 పిక్చర్స్ – యూవీ క్రియేషన్స్ కలిసి మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీవాసు నిర్మాతగా మ్యాచో హీరో గోపీచంద్‌తో ఓ సినిమాను ఎనౌన్స్ చేశారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన కొన్ని కీలక ప్రకటనలను సైతం దర్శకుడు మారుతి తనదైన శైలిలో విడుదల చేస్తూ వచ్చారు.
ఈ చిత్ర విడుదల తేదీని కార్టూన్ క్యారకేచర్లు వాడుతూ వినూత్నంగా ప్రకటించడం కూడా అందర్నీ ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి ‘పక్కా కమర్షియల్’ అనే టైటిల్‌ని ప్రకటించి, టైటిల్ లుక్‌ని ప్రేమికులరోజు కానుకగా విడుదల చేశారు. ఈ సినిమాతో ముచ్చటగా మూడోసారి జీఏ2 పిక్చర్స్ – యూవీ క్రియేషన్స్ – బన్నీవాసు – మారుతి కాంబినేషన్ సెట్ అయింది. గతంలో ఈ బ్యానర్స్ ద్వారానే దర్శకుడు మారుతి భలేభలే మగాడివోయ్, ప్రతిరోజు పండగే వంటి బ్లాక్ బస్టర్స్ అందించారు. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థలు జి ఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ లో భలే భలే మగాడివోయ్, టాక్సీవాలా, ప్రతిరోజు పండుగే చిత్రాలతో హ్యాట్రిక్ రాగా ఇప్పుడు డబుల్ హ్యాట్రిక్‌కి శ్రీకారం అన్నట్లుగా గోపిచంద్ 29వ సినిమాగా, మారుతి 10వ సినిమాగా ఈ ‘పక్కా కమర్షియల్’ అక్టోబర్ 1న ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.
గోపీచంద్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి
సమర్పణ – అల్లు అరవింద్
బ్యానర్ – జీఏ2పిక్చర్స్, యూవీక్రియేషన్స్
నిర్మాత – బన్నీవాసు
ఆర్ట్ – రవీంద్ర
పీఆర్ఓ – ఏలూరు శ్రీను, మేఘశ్యామ్
మ్యూజిక్ – జకేస్ బీజాయ్
సినిమాటోగ్రఫి – కరమ్ చావ్ల
ఎడిటింగ్ – ఎస్‌పి ఉద్భవ్
సహ నిర్మాత – ఎస్ కే ఎన్
దర్శకుడు – మారుతి