Friday, October 18, 2024

రొమియోకి పంచ్‌ ఇచ్చేలా వచ్చిన ‘రాధేశ్యామ్‌’.. రిలీజ్‌ డేట్‌ ఖరారు

Prabhas Radhe Shyam: యంగ్‌ రెబల్ స్టార్ ప్రభాస్, గాడ్జియస్ బ్యూటీ పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ లవ్లీ ఎంటర్‌టైనర్‌ చిత్రం ‘రాధేశ్యామ్’. పాన్ ఇండియన్ సినిమాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై అన్ని భాషలలో కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రభాస్, పూజా హెగ్డే ఫస్ట్ లుక్‌లకు.. మోషన్ పోస్టర్‌కు ఎటువంటి రెస్పాన్స్‌ వచ్చిందో తెలిసిందే. తాజాగా ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి14 ఉదయం 9.18 నిమిషాలకు రాధేశ్యామ్ రొమాంటిక్ గ్లింప్స్‌ని మేకర్స్‌ విడుదల చేశారు. పూర్తిగా ల‌వ్లీగా, రొమాంటిక్ ఫీల్‌తో సాగేలా ఈ గ్లింప్స్‌ని సిద్ధం చేశారు.

గ్లింప్స్‌ విషయానికి వస్తే.. చాలా కూల్‌గా మొదలైన ఈ గ్లింప్స్‌ ‘Sei Un Angelo? Devo Morire per incontrarti?’ అంటూ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ఇటాలీయ‌న్‌లో ప‌లికిన సంభాష‌ణ‌లతో రొమాంటిక్‌గా సాగింది. ఆ త‌రువాత గ్లింప్స్‌ ఎండ్‌లో హీరోయిన్ పూజా హెగ్దే ప్ర‌భాస్‌ను ”నువ్వేమైనా రోమియో అనుకుంటున్నావా..?” అంటే దానికి స‌మాధానంగా ”ఛా వాడు ప్రేమ‌కోసం చచ్చాడు.. నేనలా కాదు” అని ప్ర‌భాస్ చెప్పిన పంచ్ డైలాగ్ ఈ గ్లింప్స్‌ని నెక్ట్స్ లెవ‌ల్‌కి తీసుకెళ్లింది. డైలాగ్స్‌తో పాటు విజువ‌ల్స్, సంగీత ద‌ర్శ‌కులు జ‌స్టిన్ ప్ర‌భాక‌ర‌న్, మిథూన్ లు ఇచ్చిన నేప‌థ్య సంగీతం వెర‌సి ఈ గ్లింప్స్‌ చూడగానే నచ్చేసేలా చేశాయి.

యంగ్‌ రెబ‌ల్ స్టార్ డా.యూవీ కృష్ణంరాజు స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్ధ‌లు గోపీ కృష్ణ మూవీస్, యూవీ క్రియేష‌న్స్ భారీ బడ్జెట్‌తో రాధే శ్యామ్ సినిమాను అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. వంశీ, ప్ర‌మోద్, ప్ర‌సీధ‌లు ఈ పాన్ ఇండియా సినిమాకు నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ప్ర‌ముఖ మ్యూజిక్ డైరెక్ట‌ర్ జ‌స్టిన్ ప్ర‌భాక‌ర‌న్ ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు, క‌న్న‌డ‌, త‌మిళ‌, మ‌ళ‌యాలీ వెర్ష‌న్స్ కు సంగీతాన్ని అందిస్తున్నారు. హిందీ వెర్షన్ కు మిథూన్, మనన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. జూలై 30న‌ ఏక‌కాలంలో హిందీ, త‌మిళ‌, తెలుగు, క‌న్న‌డ‌, మ‌ళ‌యాలం భాష‌ల్లో ఈ చిత్రాన్ని భారీ రేంజ్‌లో విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు.

నటీనటులు:
ప్రభాస్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి
సాంకేతిక నిపుణులు
దర్శకుడు: రాధాకృష్ణ కుమార్
నిర్మాతలు: వంశీ, ప్ర‌మోద్, ప్ర‌సీధ‌
బ్యానర్స్: గోపీ కృష్ణ మూవీస్, యూవీ క్రియేష‌న్స్
సంగీతం: జ‌స్టిన్ ప్ర‌భాక‌ర‌న్, మిథూన్, మనన్ భరద్వాజ్
పిఆర్ఓ: ఏలూరు శ్రీను

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

2,894FansLike
4,583FollowersFollow
8,907FollowersFollow
3,457FollowersFollow
2,267FollowersFollow
6,786SubscribersSubscribe
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x