Friday, April 4, 2025

ఇంత పిరికి సీఎం ఎక్కడా లేడు.. యువనేత విసుర్లు!

పట్నా: బిహార్ సీఎం నితీష్ కుమార్‌పై ఆ రాష్ట్ర యువనేత తేజస్వి యాదవ్ మండి పడ్డారు. నితీష్ కుమార్ దేశంలోనే అత్యంత బలహీన ముఖ్యమంత్రి అని ఈ రాష్ట్రీయ జనతాదళ్ నేత విమర్శించారు. రాష్ట్ర కేబినెట్‌లోని ఒక మంత్రి బంధువు స్వయంగా లిక్కర్ స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న ఆరోపణలు రావడంపై తేజస్వి స్పందించారు. ఈ ఆరోపణలు అత్యంత తీవ్రమైనవని, దీనిపై అసెంబ్లీలో చర్చించడానికి నితీష్ విముఖంగా ఉన్నారని ఆయన ఆరోపించారు. శనివారం నాడు ఇక్కడ మీడియాతో మాట్లాడిన తేజస్వి, మంత్రి బంధువుపై లిక్కర్ స్మగ్లింగ్ ఆరోపణలను చాలా తీవ్రంగా పరిగణించాలని అన్నారు. దీనిపై అసెంబ్లీలో చర్చ జరగాలని డిమాండ్ చేశారు. తన మంత్రిపైనే తీవ్ర ఆరోపణలు వచ్చినప్పుడు సభకు నితీష్ గైర్హాజరు కావడం ఏంటని నిలదీశారు. ‘ప్రభుత్వానికి భయం పట్టుకుంది. వణికిపోతోంది. విపక్షాలకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడం లేదు. మేము ఎక్కడ సాక్ష్యాలు చూపిస్తామోనని హడలిపోయి చస్తున్నారు. నితీష్ కుమార్ అంతటి పిరికి ముఖ్యమంత్రి ఎక్కడ వెదికినా దొరకడు’ అని తేజస్వి ఎద్దేవా చేశారు.

బిహార్ ఉప ముఖ్యమంత్రి తార్‌కిషోర్ ప్రసాద్‌పై కూడా తేజస్వి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘డిప్యూటీ సీఎం పదవి అనేది రాజ్యాంగ బద్ధమైన పదవి కాదు. నన్ను మాట్లాడేందుకు స్పీకర్ అనుమతి ఇచ్చిన సమయంలో ఆయన ఎందుకు అడ్డుకుంటున్నారు? స్పీకర్‌ను శాసించే అధికారం ఆయనకు ఎవరు ఇచ్చారు? రాజ్యాంగం అంటే తెలియని వాళ్లు ఈ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారు’ అంటూ నితీష్ సర్కార్‌పై తేజస్వి నిప్పులు చెరిగారు. బిహార్‌ను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ధ్వంసం చేస్తోందని ఆయన ఆరోపించారు.

ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, నిరుద్యోగం తారాస్థాయికి చేరిందని, రైతుల నుంచి విద్యార్థుల వరకూ ఎవరూ సంతోషంగా లేరని విమర్శించారు. మహిళలకు భద్రత లేదన్నారు. ప్రతిపక్షాలను సభలో మాట్లాడేందుకు అనుమతించడం లేదని, విధానసభ కేవలం జేడీయూ, బీజేపీ కార్యాలయంగా మారిందని విమర్శలు గుప్పించారు.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Most Voted
Newest Oldest
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

2,894FansLike
4,583FollowersFollow
8,907FollowersFollow
3,457FollowersFollow
2,267FollowersFollow
6,786SubscribersSubscribe
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x