Friday, October 18, 2024

Turmeric: పసుపుతో ఎన్ని ప్రయోజనాలో మీకు తెలుసా?

ప్రస్తుత పరిస్థితులలో ప్రతి ఒక్కరు ఆరోగ్యం విషయంలో చాలా శ్రద్ధ చూపిస్తున్నారు. ప్రతి చిన్న విషయానికి ఎంతో జాగ్రత్త వహిస్తున్నారు. అందులో భాగంగానే ఆయుర్వేదం లాంటి సహజ సిద్ధ పద్దతులపై ప్రజలలో అవగాహన పెరిగింది. మన ఇంట్లో వస్తువులే మనకి ఎంతగా ఉపయోగపడతాయో తెలుసుకుంటే డాక్టర్లతో అంతగా అవసరం ఉండదు. అలాంటి వాటిల్లో ప్రముఖంగా చెప్పుకోవాల్సిన వాటిల్లో పసుపుకి చాలా ప్రాధాన్యం ఉంది. కరోనా లాక్‌డౌన్‌ సమయంలో కూడా పసుపు ఎంతగా ఉపయోగమో చాలా మందికి తెలిసివచ్చింది. జ‌లుబు చేసిన‌ప్పుడు వేడి నీటిలో ప‌సుపు క‌లిపి ఆవిరిప‌ట్టే విధానం చాలా మందికి తెలిసిందే. ఇలా కేవలం వంట కోసం మాత్రమే ఉపయోగించే పసుపుతో ఎన్నో ప్రయోజనాలున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

పసుపు వల్ల ప్రయోజనాలు:
– ఆడుకునే సమయంలో తరచూ పిల్లలు పడుతూ ఉంటారు. దెబ్బలు తగులుతుంటాయి. హాస్పిటల్ అందుబాటులో లేనప్పుడు ముందుగా మనం చేసే ప్రథమ చికిత్సకు ఔషధంలా పనిచేసేది ఇంట్లో ఉండే పసుపు అనేది చాలా మందికి తెలియదు. కొద్దిగా పసుపుని గాయమైన చోట పెట్టినట్లయితే.. అందులో ఉండే యాంటీ సెప్టిక్ గుణాల వలన రక్తస్రావం కాకుండా ఉంటుంది. అలాగే చిటికెడు పసుపుని పాలలో కలిపి ఇవ్వడం వలన కూడా ప్రయోజనం ఉంటుంది.

-ఒక గ్లాస్ నీటిలో కొద్దిగా అల్లం తురుము, అర టీస్పూన్ పసుపు కలిపి మరిగించి, వడకట్టి తాగినట్లయితే శరీరంలోని కొవ్వు తగ్గుతుంది. కొవ్వు కరిగించుకునేందుకు ఎంతగా ప్రయత్నాలు చేస్తున్నారో తెలియంది కాదు. అలాంటి వారంతా ఈ విధానాన్ని చేసి చూడండి.. అద్భుతమైన రిజల్ట్ మీ సొంతం.

– కొద్దిగా పసుపు, టీస్పూన్ నిమ్మరసం కలిపి పేస్టులా చేసి పిగ్మెంటేషన్ ఉన్న చోట అప్లై చేసి ఒక 20 నిమిషాల తరువాత నీటితో కడిగేయాలి. ఇలా తరుచూ చేస్తూ అనూహ్యమైన మార్పును చూస్తారు.

-పసుపుని కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్, ఆముదం లాంటి నూనెలతో కలిపి కాలిన గాయాలపై రాసినట్లైతే ఆ గాయాలు త్వరగా మానతాయి. ఇవే కాదు.. పసుపు వల్ల మరెన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వాటిని మరో అప్‌డేట్‌లో తెలుసుకుందాం.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

2,894FansLike
4,583FollowersFollow
8,907FollowersFollow
3,457FollowersFollow
2,267FollowersFollow
6,786SubscribersSubscribe
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x