యువ కథానాయకుడు అడివి శేష్ ‘మరణం’ చిత్ర ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. శ్రీమతి బి.రేణుక సమర్పణలో ఓషియన్ ఫిలిం ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై వీర్ సాగర్, శ్రీ రాపాక ప్రధాన పాత్రలో.. వీర్ సాగర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హారర్ చిత్రం ‘మరణం’. కర్మ పేస్ అనేది ఉప శీర్షిక. ఈ సినిమా మొదటి ప్రచార చిత్రాన్ని యువ కథానాయకుడు అడివి శేష్ చేతుల మీదుగా విడుదల చేయించారు మేకర్స్. ఈ కార్యక్రమంలో అడవి శేష్‌తో పాటు వీర్ సాగర్, శ్రీ రాపాక పాల్గొన్నారు.
ఫస్ట్ లుక్ విడుదల అనంతరం హీరో అడివి శేష్ మాట్లాడుతూ.. ‘‘మరణం ఫస్ట్ లుక్‌ను విడుదల చేయటం చాలా సంతోషంగా ఉంది. పోస్టర్ చాలా బాగుంది మరియు భయపెడుతుంది, నాకు హారర్ చిత్రాలు అంటే భయం కానీ చాలామంది ప్రేక్షకులు ఇలాంటి హారర్ చిత్రాలు బిగ్ స్క్రీన్ పై చూడటానికి ఇష్టపడతారు. పోస్టర్ ఎంత బాగుందో టీజర్ కూడా అంతే బాగుంది, మంచి సాంకేతిక విలువలతో నిర్మించారు. సినిమా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది అని అనిపించింది. హీరో దర్శకుడు వీర్‌కి, హీరోయిన్ శ్రీ రాపాకకి నా శుభాకాంక్షలు. ఈ చిత్రం థియేటర్స్‌లో విడుదలై మంచి విజయం సాధించాలి’’ అని కోరారు.
వీర్ సాగర్ మాట్లాడుతూ.. ‘‘మా మరణం సినిమా ఫస్ట్ లుక్‌ను హీరో అడివి శేష్‌గారు విడుదల చేయటం చాలా సంతోషంగా ఉంది. మా సినిమా విజయానికి ఇది మా మొదటి అడుగు. మేము పిలవగానే వచ్చి మా సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేసిన అడివి శేష్ గారికి ధన్యవాదాలు. నన్ను నా కథను నమ్మి మా చిత్రాన్ని నిర్మించిన మా నిర్మాత బి రేణుకగారికి నా ధన్యవాదాలు. మా హీరోయిన్ శ్రీకి స్పెషల్ థాంక్స్. ఎందుకంటే తాను తన సొంత సినిమాగా భావించి పని చేసింది. ఈ సినిమా మా అందరికి మంచి బ్రేక్ ఇస్తుంది’’ అని అన్నారు.
హీరోయిన్ శ్రీ రాపాక మాట్లాడుతూ.. ‘‘మా మరణం సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేసిన హీరో అడివి శేష్‌గారికి ధన్యవాదాలు. నన్ను నమ్మి నాకు ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ ఇచ్చిన మా హీరో, డైరెక్టర్ వీర్ సాగర్ గారికి ధన్యవాదాలు. కరోనా టైం లో లాక్‌డౌన్‌లో సినిమా చేశాము. అవుట్ పుట్ బాగా వస్తుంది. మాకు ఇంత సపోర్ట్ ఇస్తున్న మా టీమ్‌కి ధన్యవాదాలు” అని తెలిపారు.