హీరో సుమంత్‌లో చాలా గొప్ప గుణం ఉంది. అదేంటంటే.. తన వద్దకు వచ్చిన సినిమా ఏదైనా తనకి సెట్ కాదని తెలిస్తే.. సగం కథ విన్న వెంటనే.. ఇది మనకు సెట్టవ్వదు అని చెబుతాడట. ఈ విషయంలో స్వయంగా సుమంతే అనేక సార్లు చెప్పాడు. రీసెంట్‌గా కూడా తను హీరోగా నటించిన ‘కపటదారి’ ప్రమోషన్‌లో కూడా మరోసారి ఈ విషయాన్ని ఆయన తెలిపాడు. తనకి సెట్ కాని ఆ కథ.. ఏ హీరోకి సెట్ అవుతుందో కూడా సుమంత్ చెబుతాడట. అంతేకాదు.. ఆ హీరోకి ఫోన్ చేసి మరీ కథ వినమని.. తన దగ్గరకు కథ తీసుకువచ్చిన వారిని పంపిస్తాడట. నిజంగా ఇది చాలా గొప్ప గుణం అని ఒప్పుకోవాల్సిందే.
కాకపోతే ఇది గొప్ప గుణమే కానీ.. ఇలా సుమంత్ తన వరకు వచ్చిన సూపర్ హిట్ చిత్రాలను కూడా మిస్సయ్యాడు. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కెరీర్‌లోనే బెస్ట్ చిత్రంగా ఇప్పటికీ చెప్పుకునే ‘తొలిప్రేమ’ చిత్రం.. ఫస్ట్ సుమంత్ వద్దకే వచ్చింది. ఆ చిత్రం తనకు సెట్ అవ్వదని దర్శకుడు కరుణాకరన్‌కి చెప్పి.. పవన్ వద్దకు పంపించాడట. ఇది అందరికీ తెలిసిన విషయమే. తాజాగా ఇలాంటి విషయమే సుమంత్ రివీల్ చేశాడు. తాజాగా ఆయన రివీల్ చేసిన విషయం కూడా మెగా హీరోదే కావడం విశేషం.
డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రూపొందిన ‘దేశముదురు’ చిత్రం ఫస్ట్ తన వద్దకే వచ్చిందట. పూరీ తనకే కథ చెప్పాడట. కానీ ఆ కథకు తను సెట్ కానని చెప్పి.. బన్నీకి ఫోన్ చేసి పూరీని పంపించాడట. ఆ చిత్రం బన్నీకి ఎటువంటి హెల్ప్ అయ్యిందో.. బన్నీకి ఎటువంటి ఇమేజ్‌ని తీసుకువచ్చిందో అందరికీ తెలిసిందే. నిజంగా ఆ చిత్రం అల్లు అర్జున్ చేశాడు కాబట్టే.. అంత పెద్ద హిట్ అయ్యింది. అదే నేను చేసి ఉంటే ఖచ్చితంగా ప్లాప్ అయ్యేది అని.. సుమంత్ రివీల్ చేశాడు. నిజంగా అలా చేయడానికి, ఇలా చెప్పడానికి కూడా ఘట్స్ ఉండాలి. అందుకే సుమంత్ అంటే హీరోలందరూ ఇష్టపడతారు.