Saturday, April 5, 2025

నితిన్‌ మరో చిత్రానికి రిలీజ్‌ డేట్‌ ఫిక్సయింది

యూత్‌ స్టార్‌ నితిన్‌ హీరోగా నటిస్తున్న మూడు చిత్రాలకు విడుదల తేదీ ఫిక్సయింది. ఇప్పటికే ఆయన నటించిన ‘చెక్‌’ చిత్రం విడుదలకు రెడీ అయిన విషయం తెలిసిందే. ఈ చిత్రం ఫిబ్రవరి 26న విడుదల కాబోతోంది. ఈ చిత్రం తర్వాత కరెక్ట్‌గా నెలకి అంటే మార్చి 26న ‘రంగ్‌ దే’ చిత్రం విడుదల కానుంది. ఈ రెండు చిత్రాలకు ఇప్పటి వరకు అధికారికంగా విడుదల తేదీ ప్రకటించారు. నితిన్‌ చేస్తున్న మరో చిత్రానికి కూడా శుక్రవారం విడుదల తేదీని ప్రకటించారు. నితిన్‌, మేర్లపాక గాంధీ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఇంకా పేరు పెట్టని చిత్రాన్ని జూన్‌ 11న విడుదల చేయబోతున్నట్లుగా చిత్రయూనిట్‌ అధికారికంగా ప్రకటించింది.

శ్రేష్ఠ్ మూవీస్ ప‌తాకంపై ఎన్‌. సుధాక‌ర్ రెడ్డి, నికితా రెడ్డి నిర్మిస్తోన్న ఈ ప్రొడ‌క్ష‌న్ నంబ‌ర్ 6 చిత్ర షూటింగ్‌ ప్రస్తుతం హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో జ‌రుగుతోంది. కీల‌క‌మైన ఈ షెడ్యూల్‌లో చిత్రంలోని ప్ర‌ధాన తారాగ‌ణ‌మంతా పాల్గొంటోంది. హీరో నితిన్ త‌న ట్విట్ట‌ర్ హ్యాండిల్ ద్వారా రిలీజ్ డేట్ పోస్ట‌ర్‌ను షేర్ చేసి, “JUNE 11th is the Date!! #Nithiin30” అని ట్వీట్ చేశారు. ఈ పోస్ట‌ర్‌లో ఆయ‌న పియానో వాయిస్తూ క‌నిపిస్తున్నారు.

త‌మ‌న్నా భాటియా ఓ ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో నితిన్ జోడీగా న‌భా న‌టేష్ న‌టిస్తున్నారు. నితిన్ మునుప‌టి చిత్రం ‘భీష్మ’ బ్లాక్‌బ‌స్ట‌ర్ కావ‌డంతో ‘నితిన్‌30’పై అభిమానుల అంచ‌నాలు చాలా ఎక్కువ‌గా ఉన్నాయి. వాటిని అందుకొనే రీతిలో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు ద‌ర్శ‌కుడు మేర్ల‌పాక గాంధీ. ‘భీష్మ’ మూవీకి సూప‌ర్ హిట్ మ్యూజిక్ ఇచ్చిన మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్ ఈ చిత్రానికీ సుమ‌ధుర బాణీల‌ను స‌మ‌కూరుస్తున్నారు. అన్నింటికీ మించి, ఇదివ‌ర‌కు ఎప్పుడూ చేయ‌ని విల‌క్ష‌ణ పాత్ర‌ను ఈ సినిమాలో చేస్తున్నారు నితిన్‌.

Nithiin, nithiin 30, merlapaka gandhi, tamanna, nabha natesh, release date, Nithiin movies,
Nithiin and Merlapaka gandhi combo movie release date

తారాగ‌ణం:
నితిన్‌, న‌భా న‌టేష్‌, త‌మ‌న్నా భాటియా, న‌రేష్‌, జిషుసేన్ గుప్తా, శ్రీ‌ముఖి, అన‌న్య‌, హ‌ర్ష‌వ‌ర్ధ‌న్, ర‌చ్చ ర‌వి, మంగ్లీ, శ్రీ‌నివాస్ రెడ్డి.
సాంకేతిక బృందం:
డైలాగ్స్‌-డైరెక్ష‌న్‌: మేర్ల‌పాక గాంధీ
నిర్మాత‌లు: ఎన్‌. సుధాక‌ర్ రెడ్డి, నికితా రెడ్డి
బ్యాన‌ర్‌: శ్రేష్ఠ్ మూవీస్‌
స‌మ‌ర్ప‌ణ‌: రాజ్‌కుమార్ ఆకెళ్ల‌
మ్యూజిక్‌: మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్‌
సినిమాటోగ్ర‌ఫీ: జె. యువ‌రాజ్‌
ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌. శేఖ‌ర్‌
ఆర్ట్‌: సాహి సురేష్‌
పీఆర్వో: వ‌ంశీ-శేఖ‌ర్‌.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Most Voted
Newest Oldest
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

2,894FansLike
4,583FollowersFollow
8,907FollowersFollow
3,457FollowersFollow
2,267FollowersFollow
6,786SubscribersSubscribe
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x