సుమంత్ అశ్విన్, శ్రీకాంత్, భూమిక, తాన్యా హోప్ ప్రధాన పాత్రలలో రోడ్ జర్నీ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇదే మా కథ’. ‘రైడర్స్ స్టోరీ’ అనేది ఉపశీర్షిక. గురుపవన్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఎన్. సుబ్రహ్మణ్యం ఆశీస్సులతో గురప్ప పరమేశ్వర ప్రొడక్షన్స్ పతాకంపై జి.మహేష్ నిర్మిస్తున్నారు. శ్రీమతి మనోరమ గురప్ప సమర్పిస్తున్నారు. ఆద్యంతం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా థియేటరల్లో విడుదల చేయనున్నట్లు గురువారం నిర్మాతలు ప్రకటించారు. దీనికి సంబంధించి రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేశారు.
ఈ పోస్టర్‌లో నలుగురు ప్రధాన పాత్రధారులు సుమంత్ అశ్విన్, శ్రీకాంత్, భూమిక, తాన్యా హోప్ మంచు ప్రదేశంలో బైక్ రైడింగ్ చేస్తూ కనిపిస్తున్నారు. అడ్వంచర్ అవైట్స్ అనే క్యాప్షన్‌తో సినిమాపై ఆసక్తిని మరింత పెంచేలా ఈ పోస్టర్ ఉంది. ఇటీవల రిపబ్లిక్ డే సందర్భంగా విడుదల చేసిన ఈ చిత్ర టీజర్‌కు మంచి స్పందన రావడంతో పాటు.. సినిమాపై అంచనాలు కూడా పెరిగాయి. నాలుగు ప్రధాన పాత్రలు, ఆ పాత్రల్లో సుమంత్ అశ్విన్, శ్రీకాంత్, భూమిక, తాన్యా హోప్ నటన హైలైట్ అవుతాయనీ, సి. రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ, సునీల్ కశ్యప్ మ్యూజిక్ సినిమాకు బాగా ప్లస్ అవుతాయని చిత్ర బృందం తెలుపుతోంది.
సుమంత్ అశ్విన్, శ్రీకాంత్, భూమిక, తాన్యా హోప్, సప్తగిరి, పృథ్వీ, సమీర్, రామ్ ప్రసాద్, జోష్ రవి, తివిక్రమ్ సాయి, శ్రీకాంత్ అయ్యంగార్, మధుమణి, సంధ్య జనక్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సాంకేతిక నిపుణులు
సినిమాటోగ్రఫీ: సి. రామ్ ప్రసాద్
సంగీతం: సునీల్ కశ్యప్
ఆర్ట్: జెకె మూర్తి
ఎడిటింగ్: జునైద్ సిద్దిఖి,
ఫైట్స్: పృథ్వీరాజ్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చిరంజీవి ఎల్.
పీఆర్వో: వంశీ-శేఖర్
ప్రొడ్యూసర్: జి. మహేష్
స్టోరీ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గురు పవన్