Friday, April 4, 2025

KTR and Harish Rao: కేటీఆర్ సీఎం అయితే.. హరీష్ సంగతేంటి..!?

తెలంగాణ: రాష్ట్రానికి యువనేత కల్వకుంట్ల తారక రామారావు ముఖ్యమంత్రి కాబోతున్నారని.. ఇదిగో.. అదుగో పట్టాభిషేకం అంటూ గత కొన్ని రోజులుగా ఏ వెబ్ సైట్లో చూసినా.. ఏ టీవీలో చూసినా.. ఏ దినపత్రికలో చూసినా ఈ ఒక్క కథనమే కనబడుతోంది. ఫలానా రోజే పట్టాభిషేకం అంటూ తారీఖుతో సహా కథనాలు ఇస్తుండటం గమనార్హం. వారికి ఎక్కడి నుంచి ఈ సమాచారం వచ్చిందో.. లేకుంటే ఓ రాయి అలా వేస్తున్నారో తెలియట్లేదు. మరోవైపు మంత్రులు, కొందరు ఎమ్మెల్యేలు, కీలక నేతలు కూడా దీనిపై స్పందిస్తూ.. ‘అయితే తప్పేంటి’ అన్నట్లుగా చెప్పుకొస్తున్నారు. కేటీఆర్ అవ్వొచ్చు.. అయినా ఎవరికీ ఇబ్బంది లేదు. ఆయన పీఠమెక్కిన తర్వాత పరిస్థితులు ఏంటన్నది ఒక్కసారి ఊహించుకుంటే కొందరు టీఆర్ఎస్ నేతలకు.. ముఖ్యంగా అధిష్టానానికి తలనొప్పి వచ్చేస్తొందట. అందుకు కారణం ట్రబుల్ షూటర్.. తెలంగాణ రియల్ కట్టప్పగా పిలుచుకునే మంత్రి హరీష్ రావు.

వాస్తవానికి తెలంగాణలో ఇప్పటికి రెండుసార్లు టీఆర్ఎస్ అధికారంలోకి రావడానికి.. ఎవరు ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా హరీష్ రావు పాత్ర కీలకమైనదేనని చెప్పుకోవాలి. కేటీఆర్‌ది కూడా కీలకంగా ఉన్నారు కానీ హరీష్ అంత మాత్రం కాదు. అలాంటిది హరీష్‌ను పక్కనెట్టి కేటీఆర్‌ను సీఎం పీఠంపై కూర్చోబెడితే పరిస్థితి ఏంటి..? అసలే రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పేరుకే ఆర్థికశాఖ ఇచ్చి సిద్ధిపేటకే ఆయన్ను పరిమితం చేశారనే విమర్శలు వెల్లువెత్తాయి. ఇలాంటి తరుణంలో కేటీఆర్‌ను సీఎం చేస్తే.. హరీష్‌లో అసంతృప్తి పెరిగిపోతుందని.. ఆయన పార్టీ మారిపోయినా.. కొత్త పార్టీ పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

మరోవైపు.. ఆయన ఎప్పుడెప్పుడు పార్టీ నుంచి బయటికొస్తారా..? ఎప్పుడెప్పుడు తమ పార్టీలోకి చేర్చుకుందామా..? అని అటు బీజేపీ.. ఇటు కాంగ్రెస్ పార్టీలు వేయి కళ్లతోనే ఎదురుచూస్తున్నాయి. ఇప్పటికే పరోక్షంగా తమ పార్టీలోకి వస్తే సీఎం అభ్యర్థి ఆయనే అంటూ చెబుతున్నారు. ఒకవేళ ఆయన టీఆర్ఎస్ నుంచి బయటికొస్తే వస్తే మాత్రం జరగాల్సిన నష్టం కేసీఆర్‌కు జరిగిపోతుందన్నది జగమెరిగిన సత్యమే. కేటీఆర్‌ను సీఎం చేస్తారన్న వార్త నిజమే అయితే.. పార్టీలో ఎలాంటి చీలికలు రాకుండా.. మరీ ముఖ్యంగా హరీష్ లాంటి వ్యక్తిలో అసంతృప్తి అనేది రాకుండా ఉండటానికి కేసీఆర్ ఏం మంత్రాగం చేస్తారో..? కేటీఆర్ సీఎం అయ్యాక కేసీఆర్ రాష్ట్ర రాజకీయాల్లోనే ఉంటారా..? లేకుంటే ఢిల్లీకెళతారా..? అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు మరి.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Most Voted
Newest Oldest
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

2,894FansLike
4,583FollowersFollow
8,907FollowersFollow
3,457FollowersFollow
2,267FollowersFollow
6,786SubscribersSubscribe
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x