తమిళ స్టార్ హీరోకి తెలుగు మాస్ మహారాజా రవితేజ సపోర్ట్‌గా నిలిచారు. అదెలా అనుకుంటున్నారా? తెలుగులోనూ మంచి నటుడిగా పేరు పొందిన సూపర్ స్టైలిష్ తమిళ స్టార్ హీరో శింబు నటించిన చిత్ర టీజర్‌ను రవితేజ విడుదల చేశారు. శింబు, కల్యాణి ప్రియదర్శన్ జంటగా.. క్రియేటివ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో.. వి హౌస్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత సురేష్ కామాచి.. 125 కోట్ల భారీ బడ్జెట్‌తో హిందీ, తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో నిర్మిస్తున్న బహుభాషా చిత్రం ‘మానాడు’ తెలుగు టైటిల్ ‘రీవైన్డ్’ను అలాగే చిత్ర టీజర్‌ను ఫిబ్రవరి 3, మధ్యాహ్నం 2.34 నిమిషాలకు మాస్ మహారాజా రవితేజ విడుదల చేశారు.
ఈ సందర్భంగా రవితేజ తన ట్వీట్‌లో.. ‘‘శింబు పుట్టినరోజు సందర్భంగా.. తను నటిస్తున్న మల్టీలింగ్యుల్ భారీ బడ్జెట్ చిత్రం తెలుగు వెర్షన్ టీజర్ రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉందని అంటూ.. శింబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. పొలిటికల్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో శింబు ముస్లింగా నటిస్తుండడం గమనార్హం. సుప్రసిద్ధ దర్శకులు భారతీరాజా, ఎస్.ఏ.చంద్రశేఖర్, ఎస్.జె.సూర్య, కరుణాకరన్ ఈ చిత్రంలో నటిస్తుండడం ఈ చిత్ర ముఖ్య ఆకర్షణల్లో ఒకటి. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం సమకూర్చుతున్నారు.
Happy Birthday @SilambarasanTR_ !! 🤗🤗 Super happy to launch the #Rewindteaser. Looks gripping! Good luck to the entire team! @vp_offl @sureshkamatchi @thisisysrhttps://t.co/WFiTDwoJiS
— Ravi Teja (@RaviTeja_offl) February 3, 2021
తమ చిత్రం ‘రీవైన్డ్’ టీజర్, తాజాగా ‘క్రాక్’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రవితేజ విడుదల చేయడం పట్ల దర్శకనిర్మాతలు సంతోషం వ్యక్తం చేశారు. కాగా ఈ చిత్ర హిందీ టీజర్ ప్రముఖ దర్శకులు అనురాగ్ కశ్యప్, తమిళ్ టీజర్ ఏ.ఆర్.రెహమాన్, కన్నడ టీజర్ కిచ్చా సుదీప్ రిలీజ్ చేయడం విశేషం. ఈ టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. టీజర్‌కు మంచి స్పందన వస్తుండటంతో చిత్రయూనిట్ సంతోషం వ్యక్తం చేసింది.