Friday, October 18, 2024

ఏప్రిల్ 1 నుంచి ఆదాయపు పన్ను, ఆర్ధిక అంశాలలో జరిగే మార్పులివే!

ఏప్రిల్ 1 రావడంతో ప్రభుత్వం కొన్ని కొత్త రూల్స్ ప్రవేశ పెడుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా ఆదాయపు పన్ను, ఆర్ధిక అంశాలలో కొన్ని మార్పులు జరగనున్నాయి. అవి ఎలా ఉన్నాయో, వాటి వలన ఎటువంటి ప్రయోజనాలున్నాయి అనేదానిపై పూర్తి సమాచారం మీకోసం.

ఈపీఎఫ్: ప్రతీ సంవత్సరం ఈపీఎఫ్ అకౌంట్‌లో రూ.2,50,000 పైనే జమ చేసేవారు వడ్డీపై ఇన్‍కమ్ ట్యాక్స్ శ్లాబ్స్ ప్రకారం పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. దానిని కేంద్ర ప్రభుత్వం ఆదాయంగా పరిగణిస్తుంది. కాబట్టి ఈ రూల్ 2021 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. అయితే ప్రతీ నెల రూ.2,00,000 కన్నా తక్కువ వేతనం పొందుతున్నవారికి ఈ మార్పు వల్ల వచ్చే నష్టమేమీ లేదు.

ఐటిఆర్ ఫార్మ్స్: ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కోసం ఇకపై ప్రీ-ఫిల్డ్ ఫామ్స్ రానున్నాయి. దీని వల్ల పన్ను చెల్లింపుదారులు సులువుగా రిటర్న్స్ ఫైల్ చేయొచ్చు.

ఎల్‌టీసీ స్కీమ్: కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో లీవ్ ట్రావెల్ కన్సెషన్-LTC వోచర్ స్కీమ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎల్‌టీసీ స్కీమ్‌లో ఇచ్చిన మినహాయింపులు మార్చి 31 వరకు మాత్రమే వర్తిస్తాయి. ఏప్రిల్ 1 నుంచి ఎలాంటి మినహాయింపులు ఉండవు.

టీడీఎస్‌: ఆదాయపు పన్ను చట్టంలో కొత్తగా 206ఏబీ సెక్షన్ చేర్చింది ఆదాయపు పన్ను శాఖ. ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయని వారు ఎవరైనా టీడీఎస్‌పై ఎక్కువ రేట్ చెల్లించాల్సి ఉంటుంది.

ట్యాక్స్ ఫిల్లింగ్: ఏప్రిల్ 1 తర్వాత 75 ఏళ్ల పైన ఉన్నవారు ఆదాయపు పన్ను రిటర్న్స్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. పెన్షన్ ద్వారా, ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై వడ్డీ ద్వారా ఆదాయాన్ని పొందుతున్నవారికి ఇది వర్తిస్తుంది. వారికి పన్నులను బ్యాంకులోనే నేరుగా డిడక్ట్ చేస్తుంది ప్రభుత్వం.

వేతనం: కొత్త వేతన కోడ్ ఏప్రిల్ 1న అమల్లోకి రానుంది. కొత్త నిబంధనల ప్రకారం అలవెన్సులు 50 శాతం మించి ఉండకూడదు. ప్రస్తుతం బేసిక్ వేతనం 35 నుంచి 45 శాతం నుంచే ఉంటుంది. దీంతో బేసిక్ పే పెంచాల్సిన అవసరం ఉంది. బేసిక్ పే పెరిగితే అందులో 12 శాతం పీఎఫ్‌ అకౌంట్‌లో జమ చేయాలి. కాబట్టి పీఎఫ్‌లో జమ చేసే మొత్తం కూడా పెరుగుతుంది. తద్వారా ఉద్యోగుల టేక్ హోమ్ శాలరీ తగ్గుతుంది.

గ్రాట్యుటీ: ఒక కంపెనీలో ఐదేళ్లు వరుసగా సేవలు అందించిన ఉద్యోగులకు గ్రాట్యుటీ లభిస్తుంది. గ్రాట్యుటీకి సంబంధించి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. ఇకపై ఒక ఏడాది పనిచేసినా గ్రాట్యుటీ ఇవ్వాలి.

టర్మ్ ఇన్స్యూరెన్స్ ప్లాన్: ఏప్రిల్ 1 నుంచి టర్మ్ ఇన్స్యూరెన్స్ ప్రీమియం రేట్స్ పెరగనున్నాయి. కరోనా వైరస్ సంక్షోభం కారణంగా డెత్ క్లెయిమ్స్ పెరిగాయి. దీంతో ప్రీమియం రేట్స్ పెంచాలని ఇన్స్యూరెన్స్ కంపెనీలు నిర్ణయించాయి. ప్రైవేట్ లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీలు ప్రీమియం పెంచుతున్నాయి. కానీ ఎల్ఐసీ మాత్రం పెరగటం లేదు.

ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్‌: టూరిజంను ప్రమోట్ చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్‌ను అందిస్తోంది. టూర్ ఆపరేటర్స్ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన 30 రోజుల్లో పర్మిట్ లభిస్తుంది. ఈ కొత్త రూల్స్ 2021 ఏప్రిల్ 1న అమల్లోకి వస్తాయి.

ప్రైస్ హైక్: ఏప్రిల్ 1న ఎలక్ట్రికల్ ఉపయోగాలు ఇతర వస్తువుల ధరలు కూడా పెరగనున్నాయి టీవీ, రిఫ్రిజిరేటర్, ఏసీల ధరలు పెరగనున్నాయి. విడిభాగాల కొరతతో పాటు ప్రభుత్వం కస్టమ్స్ డ్యూటీ పెంచడం లాంటి కారణాలతో వీటి ధరలు పెరగనున్నాయి. వీటితో పాటు ఎల్ఈడీ లైట్స్, మొబైల్ ఫోన్లు, సోలార్ ఇన్వర్టర్లు, లాంతర్లు, ఆటో మొబైల్ పార్ట్స్, స్మార్ట్‌ఫోన్ ఛార్జర్ కాంపోనెంట్స్, లిథియం ఇయాన్ బ్యాటరీ రా మెటిరీయల్స్, ఇంక్ క్యాట్రిడ్జెస్, లెదర్ ప్రొడక్ట్స్, నైలాన్ ఫైబర్, ప్లాస్టిక్ బిల్డర్ వేర్స్, పాలిష్డ్ సింథటిక్ స్టోన్స్, పాలిష్డ్ క్యూబిక్ జిర్కోనియా లాంటి ధరలు పెరుగుతాయి.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

2,894FansLike
4,583FollowersFollow
8,907FollowersFollow
3,457FollowersFollow
2,267FollowersFollow
6,786SubscribersSubscribe
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x