Friday, April 4, 2025

‘ఉప్పెన’.. చిత్రానికి పవర్ స్టార్ ఆశీస్సులు

Pawan Kalyan Uppena: ‘ఉప్పెన’ చిత్రానికి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఆశీస్సులు కూడా అందాయి. రీసెంట్‌గా ప్రీ రిలీజ్ వేడుకలో మెగాస్టార్ ఆశీస్సులు అందుకున్న ఈ చిత్రానికి తాజాగా పవర్ స్టార్ ఆశీస్సులు దక్కాయి. మన జీవితాల్ని.. అందులోని భావోద్వేగాల్ని.. మన చుట్టూ ఉన్న పరిస్థితులను కథగా తెర మీదకు తీసుకువచ్చే చిత్రాలను ప్రేక్షకులు ఎక్కువ కాలం గుర్తుంచుకొంటారు. ఆ కోవలోకి ‘ఉప్పెన’ చిత్రం చేరుతుంది అని ప్రముఖ కథానాయకులు, జనసేన అధ్యక్షులు ‘పవర్ స్టార్’ పవన్ కల్యాణ్ అన్నారు. మన మట్టి పరిమళాన్ని అందించే ఇలాంటి చిత్రాలు ప్రతి ఒక్కరికీ నచ్చుతాయి అన్నారు. వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘ఉప్పెన’. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఈ నెల 12వ తేదీన చిత్రం విడుదలవుతోంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కి ఈ చిత్ర ట్రైలర్‌ను, ప్రమోషనల్ కంటెంట్‌ను చిత్ర కథానాయకుడు వైష్ణవ్ తేజ్, దర్శకుడు బుచ్చిబాబు, నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ చూపించారు. ట్రైలర్ ఎంతో ఆసక్తికరంగా ఉందని చెబుతూ.. పవన్ కల్యాణ్ చిత్ర బృందాన్ని ప్రశంసించారు.

power star, pawan kalyan, uppena, blessings, vaisshnav tej, buchibabu sana, kriti shetty, uppena movie, ఉప్పెన, పవన్ కల్యాణ్, వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి, ఆశీస్సులు, బుచ్చిబాబు సానా, రవిశంకర్, మైత్రీ మూవీ మేకర్స్
‘ఉప్పెన’.. చిత్రానికి పవర్ స్టార్ ఆశీస్సులు | Pawan Kalyan blessings to Uppena

ఈ సందర్భంగా ‘పవర్ స్టార్’ పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. “వైష్ణవ్ తేజ్ హీరోగా తొలి చిత్రంలోనే చాలా మంచి పాత్రను ఎంచుకున్నాడు. మొదటి అడుగులోనే సవాల్‌తో కూడుకున్న పాత్ర తీసుకున్న వైష్ణవ్ తేజ్ తప్పకుండా ప్రేక్షకుల మెప్పు పొందుతాడు. వైష్ణవ్ ‘జానీ’ చిత్రంలో బాల నటుడిగా… హీరో చిన్నప్పటి పాత్రను పోషించాడు. ఇప్పుడు హీరోగా ఎదిగాడు. ‘ఉప్పెన’లో వైష్ణవ్ చాలా ఆకట్టుకొనేలా ఉన్నాడు. దర్శకుడిగా బుచ్చిబాబు సానా ఈ కథను ఎంతో సమర్థంగా తెరకెక్కించారు అని అర్థం అవుతోంది. మనకు పరిచయం ఉన్న జీవితాలను… అందులోని ఎమోషన్స్‌ను… మన నేటివిటీనీ కళ్ల ముందుకు తీసుకువచ్చే చిత్రాలు ఎప్పుడూ జ్ఞాపకం ఉంటాయి. వీటికి సెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ‘రంగస్థలం’, ‘దంగల్’ లాంటి చిత్రాల్లో ఉండే ఎమోషన్స్ ఎక్కువ కాలం మనకు గుర్తుండిపోతాయి. ‘ఉప్పెన’ కథలోని ఎమోషన్స్ కూడా తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతాయి. మంచి కథను తెరకెక్కించిన దర్శకుడు బుచ్చి బాబుకీ, ఈ చిత్ర నిర్మాతలకు, సాంకేతిక నిపుణులకు, నటులకు నా అభినందనలు. ‘ఉప్పెన‘ ఘన విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నాను..’’ అని తెలిపారు.

పంజా వైష్ణ‌వ్ తేజ్‌, విజ‌య్ సేతుప‌తి, కృతి శెట్టి, సాయిచంద్‌, బ్ర‌హ్మాజీ తదితరులు నటించిన ఈ చిత్రానికి
సాంకేతిక బృందం:
క‌థ‌, స్క్రీన్‌ప్లే, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం: బుచ్చిబాబు సానా
నిర్మాత‌లు: న‌వీన్ ఎర్నేని, వై. ర‌విశంక‌ర్‌
బ్యాన‌ర్స్‌: మైత్రి మూవీ మేక‌ర్స్‌, సుకుమార్ రైటింగ్స్‌
సీఈవో: చెర్రీ
మ్యూజిక్‌: దేవి శ్రీ‌ప్ర‌సాద్‌
సినిమాటోగ్ర‌ఫీ: షామ్‌ద‌త్ సైనుద్దీన్‌
ఎడిటింగ్‌: న‌వీన్ నూలి
ఆర్ట్‌: మౌనిక రామ‌కృష్ణ‌
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్స్‌: అనిల్ వై, అశోక్ బి.
పీఆర్వో: వ‌ంశీ-శేఖ‌ర్‌, మ‌ధు మ‌డూరి.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Most Voted
Newest Oldest
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

2,894FansLike
4,583FollowersFollow
8,907FollowersFollow
3,457FollowersFollow
2,267FollowersFollow
6,786SubscribersSubscribe
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x