Tuck Jagadish Lyrical Song: న్యాచురల్ స్టార్ నాని, రీతు వర్మ, ఐశ్వర్యా రాజేష్ హీరోహీరోయిన్లుగా ‘నిన్నుకోరి’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీని ప్రేక్షకులకు అందించిన శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘టక్ జగదీష్‘. నాని 26వ చిత్రంగా రూపొందుతోన్న ఈ మూవీని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. సంగీత సంచలనం ఎస్.ఎస్. థమన్ మ్యూజిక్ ఈ సినిమాకు ఓ ఎస్సెట్. ఆయన సంగీతంలో రూపొందిన ‘ఇంకోసారి ఇంకోసారి’ అనే పాట లిరికల్ వీడియోను ఫిబ్రవరి 13 ఉదయం 9 గంటలకు విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం అధికారికంగా తెలియజేసింది. ఈ పాటను చిత్రంలో నాని, రీతు వర్మ జంటపై చిత్రీకరించారు.
ఈ చిత్రానికి సంబంధించి ఇదివరకు రిలీజ్ చేసిన రిలీజ్ డేట్ పోస్టర్‌కు మంచి స్పందన వచ్చిన విషయం తెలిసిందే. ఆ పోస్టర్‌లో కుటుంబ సభ్యుల మధ్యలో పెళ్ళికొడుకుగా రెడీ అవుతున్న నాని లుక్ వైరల్ అయ్యింది. దర్శకత్వం వహిస్తుండటంతో పాటు రచన కూడా శివ నిర్వాణ చేస్తున్న ఈ చిత్రానికి ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. ప్రవీణ్ పూడి ఎడిటర్‌గా, వెంకట్ ఫైట్ మాస్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
13 ki vindhaam
14th ki repeatseyyyFirst single of tuck will be out on 13th Feb morning 9AM #InkosaariInkosaari
A @MusicThaman Musical .. Our first album 🤗
Tuck and Play 🤍@ShivaNirvana @riturv @aishu_dil @Shine_Screens @adityamusic pic.twitter.com/O0lXGe76VV
— Nani (@NameisNani) February 10, 2021
నేచురల్ స్టార్ నాని, రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేష్, నాజర్, జగపతి బాబు, రావు రమేష్, నరేష్, డానియల్ బాలాజీ, తిరువీర్, రోహిణి, దేవదర్శిని, ప్రవీణ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సాంకేతిక బృందం:
సంగీతం: ఎస్. తమన్
సినిమాటోగ్రఫీ: ప్రసాద్ మూరెళ్ల
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
ఆర్ట్: సాహి సురేష్
ఫైట్స్: వెంకట్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్. వెంకటరత్నం (వెంకట్)
కో- డైరెక్టర్: లక్ష్మణ్ ముసులూరి
క్యాస్టూమ్ డిజైనర్: నీరజ కోన
పీఆర్వో: వంశీ-శేఖర్
నిర్మాతలు: సాహు గారపాటి, హరీష్ పెద్ది
రచన-దర్శకత్వం: శివ నిర్వాణ