Radhe Shyam glimpse: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, గాడ్జియస్ బ్యూటీ పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ లవ్లీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘రాధేశ్యామ్’. పాన్ ఇండియన్ సినిమాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై అన్ని భాషలలో కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రభాస్, పూజా హెగ్డే ఫస్ట్ లుక్‌లకు.. మోషన్ పోస్టర్‌కు ఎటువంటి రెస్పాన్స్ వచ్చిందో తెలిసిందే. తాజాగా ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి14 ఉదయం 9.18 నిమిషాలకు రాధేశ్యామ్ రొమాంటిక్ గ్లింప్స్‌ని మేకర్స్ విడుదల చేశారు. పూర్తిగా లవ్లీగా, రొమాంటిక్ ఫీల్‌తో సాగేలా ఈ గ్లింప్స్‌ని సిద్ధం చేశారు.
నటీనటులు:
ప్రభాస్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి
సాంకేతిక నిపుణులు
దర్శకుడు: రాధాకృష్ణ కుమార్
నిర్మాతలు: వంశీ, ప్రమోద్, ప్రసీధ
బ్యానర్స్: గోపీ కృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్
సంగీతం: జస్టిన్ ప్రభాకరన్, మిథూన్, మనన్ భరద్వాజ్
పిఆర్ఓ: ఏలూరు శ్రీను