రామజోగయ్య శాస్త్రి.. ఈయన పాట మధురం. ఈయన రాసే ప్రతి పదం అజరామరం. ఎన్నో పాటలకి అద్భుతమైన స్వరాలని అందించిన ఈయన ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త చిత్రానికి కూడా అద్భుతమైన స్వరాలని అందించారు. పవన్ కళ్యాణ్ లాయర్ గా నటిస్తున్న చిత్రం వకీల్ సాబ్. ఈ మధ్యే ఈ చిత్రానికి సంబంధించిన సత్యమేవ జయతే పాటని రిలీజ్ చేయటం జరిగింది. ఈ పాట ఎంతోమంది హృదయాల్ని గెలుచుకుంది. అందులో శాస్త్రి గారు రాసిన ప్రతి పదం యువతరాన్ని మేలుకొలిపేదిగా ఉంది. ఈ పాటకి సోషల్ మీడియాలో అనూహ్య స్పందన లభించింది. ఈ పాట గురించి నెటిజన్లు తమ అభిప్రాయాల్ని పంచుకుంటూ…
రెస్పాన్స్ అన్ని పాటలకు వస్తుంది.. కానీ రెస్పెక్ట్ కొన్ని పాటలకే వస్తుంది..ఈ పాటకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు.. జై పవనిజం.. అంటూ ఒక అభిమాని అంటుంటే… మరొకరు… ఇ౦కో పదేళ్లు గుర్తు౦డి పోతుంది గురువుగారు.. గు౦డె పెట్టి రాసారు. అని, దుమ్ము లేచిపోయింది శాస్త్రి గారు.. అని మరో అభిమాని… ఇంకొకరైతే టివిలో పవన్ సాంగ్ కి చేతిలో కర్పూరం వెలిగించుకుని హారతి ఇస్తున్నారు. ఇలా ఉంది రెస్పాన్స్..
ఇంతమంది హృదయాల్ని గెలుచుకున్న ఈ పాట ఎప్పటికి తెలుగు సినీ చరిత్రలో నిలుచుండి పోతుంది అంటే అతిశయోక్తి కాదేమో. ఇందరిని మెప్పించిన పాట రాసిన రామజోగయ్య శాస్త్రి గారికి, అంతే అద్భుతంగా పాడిన శంకర్ మహదేవన్, పృథ్వి చంద్ర, పాటని స్వరపరచిన సంగీత దర్శకుడు ఎస్ ఎస్ థమన్ కి… ఈ పాటకి నటించిన పవన్ కళ్యాణ్ కి ఎప్పటికి ఈ పాట ఓ మైలు రాయిలా గుర్తుండి పోతుంది.
ఇంత మంది అభిమానుల ప్రతిస్పందన చూసిన రామజోగయ్య శాస్త్రి స్పందిస్తూ… సత్యమేవజయతే పాటని హృదయానికి హత్తుకున్న ప్రతి ఒక్కరికీ శ్రీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు… ఈసారి మాధుర్యభరితంగా మాట్లాడుకుంటామేమో వేచి చూద్దాం. అంటూ తన స్పందనని తెలియ చేశారు.