మనం ప్రతిరోజు చూస్తూ, అభిమానించే వారిలో యాంకర్స్ ది మొదటి స్థానమే. ఎప్పుడెప్పుడు వారు కనిపిస్తారా అని చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు టీవీలకి అతుక్కుపోయి ఎదురు చూస్తూ ఉంటారంటే అతిశయోక్తి కాదు. అలా ప్రతి ఒక్కరి మనసుల్ని దోచుకున్న వారిలో మొదటిగా చెప్పుకోవాల్సిన వ్యక్తి ఎవరంటే సుమ అనే చెప్తారు ఎవరైనా. తరువాతి స్థానంలో ఉన్నది అనసూయ, రష్మీ, శ్రీముఖి. ఇంతగా అభిమానిస్తున్న వీరి నెలసరి ఆదాయం ఎంత అని ఎవరినైనా అడిగితే, ఆ ఏముంది నెలకి 25 వేలో, మహా అయితే 50 వేలో అనుకుంటారు. అలా అనుకుంటే పప్పులో కాలేసినట్లే సుమా. వీరి నెలసరి ఆదాయం వేలల్లో కాదు లక్షల్లో ఉంటుందంటే ఎవరైనా నమ్ముతారా. ఇదే నిజం. కావాలంటే మీరే చదవండి.
సుమ కనకాల టీవీ షోలతో పాటు, సినీ ఇండస్ట్రీలో జరిగే ప్రతి ఈవెంట్ కి ఈమె ఉంటారు. ఒక్క ఆడియో ఫంక్షన్ కి ఈమె యాంకరింగ్ చేశారంటే కనీసం 2 నుంచి 2.5 లక్షలు తీసుకుంటుంది. తరువాతి స్థానంలో ఉన్న అనసూయ రెమ్యూనరేషన్ ఒక్క ఈవెంట్ కి 2 లక్షలు ఉంటుందని టాక్. ఈ మధ్య కాలంలో ఈమె ఈవెంట్స్ కంటే సినిమాలపై ఎక్కువ దృష్టి పెట్టింది. ఒక్క ఈవెంట్ కే అంత తీసుకుంటే ఒక సినిమాకి ఎంత తీసుకుంటుందో మీరే ఆలోచించండి.
ఇకపోతే రష్మీ. ఈమె జబర్దస్త్, ఈవెంట్స్ తో పాటు ఇతర ఓపెనింగ్స్ కి వెళుతూ ఉంటుంది. ఈమె ఆదాయం దాదాపు 1.5 పైనే. శ్రీముఖి విషయానికి వస్తే ఈమె ఒక్కో ఈవెంట్ కి 1 లక్ష రూపాయలు ఉంటుంది. చూశారుగా వారి అందం, అభినయం, మాటతీరుతో అభిమానుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తున్న మన యాంకర్ల జీవన శైలి ఎంత రిచ్ గా ఉందో.