Friday, October 18, 2024

షర్మిల కొత్త పార్టీ పెడతారా.. వైసీపీతోనే ముందుకెళ్తారా!?

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె, ప్రస్తుత ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల కొత్త పార్టీ స్థాపించబోతున్నారా..? తెలుగు రాష్ట్రాలపై పూర్తి అవగాహన ఉన్న ఆమె మరికొన్ని గంటల్లో పార్టీ పేరు ప్రకటించబోతున్నారా..? అభిమానులు, అనుచరుల మధ్యన పార్టీ గురించి చర్చించి కీలక నిర్ణయం తీసుకోబోతున్నారా..? అంటే తాజా పరిణామాలను బట్టి చూస్తే ఇవన్నీ అక్షరాలా నిజమనిపిస్తోంది. ఇంతకీ మరికొన్ని గంటల్లో జగనన్న వదిలిన బాణం షర్మిల ఏం చేయబోతున్నారు..? తెలంగాణలో కొత్త పార్టీ స్థాపిస్తారా..? లేకుంటే జాతీయ పార్టీ అయిన వైసీపీనే తెలంగాణలో కూడా కొనసాగిస్తారా..? అనే విషయాలు ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.

పార్టీ నిజమేనా..!?
గత కొన్ని రోజులుగా షర్మిల కొత్త పార్టీ స్థాపించబోతున్నారని.. ఇందుకు కారణం జగన్‌-షర్మిల మధ్య మనస్పర్థలు వచ్చాయని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అంతేకాదు.. ఇప్పటికే పార్టీ పేరు కూడా రిజిష్టర్ కూడా చేయించారని పుకార్లు షికార్లు చేశాయి. ఈ విషయాలన్నింటినీ ఓ ప్రముఖ దినపత్రిక ఫ్రంట్ పేజీలోనే పెద్ద కథనాన్నే ప్రచురించింది. అయితే ఈ కథనంపై తీవ్రంగా స్పందించిన షర్మిల.. వాటిన్నంటినీ ఖండించి మళ్లీ మళ్లీ ఇలాంటి కథనాలు రాస్తే న్యాయపరంగా చర్యలు తీసుకుంటానని సదరు పత్రిక యాజమాన్యాన్ని హెచ్చరించారు. ఆ తర్వాత కూడా ఆ దినపత్రిక యాజమాన్యం మళ్లీ షర్మిలపై ప్రత్యేకంగా కథనాలు వండి వార్చింది. అయితే వాటిపై మాత్రం వైసీపీ నుంచి గానీ.. షర్మిల తరఫున ఎవరూ మాట్లాడలేదు.

ఒక్కటే వార్తలే..!
సోమవారం మధ్యాహ్నం నుంచి మళ్లీ ఒక్కసారిగా తెలుగులోని అన్ని చానెల్స్‌లో షర్మిల గురించే వార్త. లోటస్‌పాండ్‌లో ఆత్మీయులు, అభిమానులు, తెలంగాణ వైసీపీ కార్యకర్తలు, అనుచరులతో షర్మిల ప్రత్యేకంగా భేటీ కాబోతున్నారన్నదే దాని ఆ వార్త సారాంశం. ప్రస్తుతం సోషల్ మీడియాలో దీనిపై పెద్ద చర్చే జరుగుతోంది. ఈ క్రమంలో తెలంగాణలోని వైఎస్ అభిమానులు, అనుచరులు, పలువురు నేతలు కూడా మంగళవారం (09/02/2021) నాడు హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌కు పయనమయ్యారు. మరోవైపు షర్మిల కూడా బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. సుమారు రెండు, మూడు గంటలపాటు వరుస కథనాలు, డిబేట్స్, వెబ్‌సైట్లలో కథనాలు వచ్చినప్పటికీ వైసీపీ తరఫున గానీ.. వైఎస్ ఫ్యామిలీ నుంచి ఒక్కరంటే ఒక్కరూ స్పందించనే లేదు. దీంతో మౌనానికి అర్థం అంగీకారమేనని స్పష్టంగా అర్థమవుతోంది.

కొత్త పార్టీనా.. లేకుంటే..!
మంగళవారం నాడు షర్మిల ఏం ప్రకటన చేయబోతున్నారు..? కొత్త పార్టీనే పెడతారా..? లేకుంటే తెలంగాణలో కూడా వైసీపీతో ముందుకెళ్తారా..? లేదా తన తల్లిదండ్రులు వైఎస్సార్-విజయమ్మ పెళ్లి రోజు కావడంతో కేక్ కట్ చేసి అంతటితో కార్యక్రమం ముగించేస్తారా ..? అన్నదానిపై ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున చర్చే జరుగుతోంది. మొత్తానికి చూస్తే అసలు షర్మిల ఎందుకు ఇలా అభిమానులతో భేటీ కాబోతున్నారు..? అసలు ఈ భేటీ వెనుక ఎజెండా ఏంటి..? ఒక వేళ కొత్త పార్టీ పేరు ప్రకటిస్తే జగన్ ఎలా ముందుకెళ్లబోతున్నారు..? వైఎస్ వీరాభిమానులకు, కార్యకర్తలు, అనుచరులకు షర్మిల ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారన్నది హాట్ హాట్ టాపిక్‌గా మారింది. అసలు షర్మిల మనసులో ఏముందో తెలియాలన్నా..? కొత్త పార్టీ ప్రకటిస్తారో లేదో తెలియాలన్నా..? మరికొన్ని గంటలు వేచి చూడక తప్పదు మరి.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

2,894FansLike
4,583FollowersFollow
8,907FollowersFollow
3,457FollowersFollow
2,267FollowersFollow
6,786SubscribersSubscribe
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x