Friday, April 4, 2025

సౌందర్య గురించి ఎవరికీ తెలియని విషయాలు చెప్పిన ఆమని

‘ఎదురింటి మంగళగౌరి వేసుకున్న గొలుసు చూడు… పక్కింటి పిన్నిగారి కాసులపేరు చూడు’ అంటూ భర్తని డబ్బులు కోసం వేధించే సగటు ఇల్లాలిగా అందరిని ఆకట్టుకున్న నటి ఆమని. ఎన్నో అద్భుతమైన చిత్రాలలో తన పాత్ర మేర ఒదిగిపోయి తన అందం అభినయంతో ఎందరో అభిమానుల్ని సంపాదించుకుంది. ఇప్పటికీ ఆమని ముఖ వర్చస్సు కానీ, శరీర ఆకృతిలో కానీ ఎటువంటి మార్పులు లేకుండా.. హీరోయిన్స్‌కి ధీటుగా ఆమె బ్యూటీని మెయింటైన్‌ చేస్తుంది. అమ్మ పాత్రలతో సినీ అభిమానుల్ని అలరిస్తూనే ఉంది. శుభలగ్నం, మావిచిగురు, సిసింద్రీ, ఆ నలుగురు, భరత్‌ అనే నేను వంటి చిత్రాలు ఆమెకు మంచి గుర్తింపును ఇచ్చాయి. తాజాగా ఆమె అప్పుడు సిసింద్రీ సినిమాలో తల్లిగా నటించిన అఖిల్‌కి.. మరోసారి మదర్‌ కాబోతోంది. మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌ చిత్రంలో అఖిల్‌కి మదర్‌గా ఆమని నటిస్తోంది. అలాగే యంగ్‌ అండ్‌ ఎనర్జిటిక్‌ హీరో కార్తికేయ నటించిన ‘చావు కబురు చల్లగా’ చిత్రంలో కూడా ఆమె హీరో మదర్‌గా నటించింది. మార్చి 19న ‘చావు కబురు చల్లగా’ చిత్రం విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఆమె కొన్ని యూట్యూబ్‌ ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఈ ఇంటర్వ్యూలలో తన స్నేహితురాలు, ప్రముఖ నటి సౌందర్య గురించి కూడా ఎన్నో విషయాలు తెలిపింది.

ఆమని.. సౌందర్య గురించి చెప్పని సంభాషణ యథాతథంగా మీకోసం:

యాంకర్: మీరు, సౌందర్య గారు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అని విన్నాము. ఏదైనా ఆమెతోనే పంచుకునే వారట. నిజమేనా.

ఆమని: అవును.. బయట సౌందర్యకి ఎంత మంది స్నేహితులైన ఉండనివ్వండి.. నాకు మాత్రం బెస్ట్ ఫ్రెండ్ సౌందర్య. మేము కలిస్తే మాత్రం అన్ని నాతోనే చెప్పుకునేది. నేను కూడా తనతోనే చెప్పుకునేదాన్ని. తనకి పెళ్లి అయిన తరువాత కూడా తనతో మాట్లాడుతుండేదాన్ని. ఎక్కడైన తన మూవీ షూటింగ్ జరుగుతున్నా నన్ను రమ్మని అడిగేది. కానీ నేను బాగుండదేమో రానే అనేదాన్ని. పర్లేదు ఇది నా మూవీనే రా అని అడిగేది. నాకు చాలా బోర్ గా ఉందే అనేది. ఎప్పుడైనా ఏదైనా సినిమా షూటింగ్ కోసం నేను బెంగళూర్ వెళ్లినా మా ఇల్లు పక్కనే ఉంది రా ఒకసారి అని పిలిచేది. కానీ నాకే టైం లేక వెళ్ళలేకపోయాను.

యాంకర్: సినిమా ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ ఉండడం వేరు. బయట కూడా ఫ్రెండ్స్ గా ఉండడం వేరు. అలాంటిది తాను ఇక లేదు అని తెలిసినప్పుడు మీరు ఎలా ఫీలైయ్యారు.

ఆమని: ముందు నేనసలు నమ్మలేదు. అబద్దం అనుకున్నాను. మీడియా వాళ్ళు అడుగుతున్నా నేనేమి మాట్లాడలేక పోయాను. నేను చాలా బాధపడ్డాను. ఆ సమయంలో నేనొక మూవీ షూటింగ్ లో ఉన్నాను. కాళ్ళు, చేతులు ఆడలేదు నాకసలు. వెళ్ళాను కనీసం చూడడానికి ఏం లేదు కదా అని నేను వెళ్ళలేదు. నెల రోజుల తరువాత వాళ్ళ అమ్మని కలవడానికి వెళ్ళాను. గుమ్మంలోనే సౌందర్య, వాళ్ళ నాన్న, అన్నయ్య కలిసి ఉన్న ఫోటో చూసి చాలా బాధేసింది.

యాంకర్: ఆమె గురించి రెండు మాటల్లో చెప్పాలంటే ఏం చెప్తారు.

ఆమని: చాలా మంది మేకప్ వేస్తేనే అందంగా ఉంటారు. కానీ తాను మాత్రం నార్మల్ గా ఉన్న దేవతలా ఉండేది. ఇంకేమి చెబుతాను. దేవతే. చాలా అందంగా ఉండేది విడిగా కూడా. అందుకే ఆ దేవతల్లోనే కలిసి పోయింది. అంటూ చాలా ఎమోషన్ అయ్యారు ఆమని.

తాను చాలా పద్దతిగా ఉండేది. ఇలానే ఉండాలి అని ఒక సిస్టంని ఫాలో అయ్యేది. నేను ఇలానే ఉంటాను అనేది. అలానే ఉండేది. తన గురించి మాట్లాడుతుంటే ఎందుకో చాలా ఎమోషన్ అయ్యిపోతాను. తనకి అసలు ఏమి తెలియదు. అన్ని వాళ్ళ నాన్న గారే చూసుకునే వారు. కానీ ఇంత కస్టపడి సంపాదించి చివరికి ఏమి అనుభవించకుండా వెళ్ళిపోయింది. అందుకే చాలా బాధగా ఉంది. వాళ్ళ నాన్న తరువాత వాళ్ళ అన్నయ్య అంత చూసుకున్నారు. అంత ఇన్నోసెంట్ గా ఉండేది. తనకి ఎన్నో ఆశలుండేవి. ఫ్యామిలీ అంటే ఇలానే ఉండాలి. తన భర్త, పిల్లల గురించి చాలా అనుకుంటూ ఒక రూల్ పెట్టుకుంది. సినిమా వేరు… ఫ్యామిలీ వేరు అంటుండేది.

తనకి వాళ్ళ నాన్న గారంటే చాలా ఇష్టం. ఎంతంటే ఆయన ఏది చెబితే అదే చేసేది. ఇది వద్దు అంటే ఆ పని ఎవ్వరు చెప్పిన చేసేది కాదు. ఆయన సడన్ గా చనిపోయినప్పుడు అన్ని వాళ్ళ అన్నయ్యే అయ్యాడు. చివరికి వాళ్ళ అన్నయ్యతో పాటే తాను కూడా వెళ్ళిపోయింది. వాళ్ళ అమ్మ గారు కూడా ఈ మధ్యే చనిపోయారని తెలిసింది. అది కూడా జగపతి బాబు చెప్తే తెలిసింది. చాలా బాధేసి వాళ్ళ ఇంటి వైపు వెళ్లి చూశాను. ఇప్పుడు ఆ ఇల్లు ఓ పాడుపడిపోయిన ఇల్లులా మారిపోయింది.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Most Voted
Newest Oldest
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

2,894FansLike
4,583FollowersFollow
8,907FollowersFollow
3,457FollowersFollow
2,267FollowersFollow
6,786SubscribersSubscribe
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x