స్త్రీ.. ఈ ఒక్క అక్షరం ప్రతి మనిషి జీవితంలోనూ ప్రధాన పాత్రధారి. ఒకప్పుడు స్త్రీని వంటింటి కుందేలుగానే చూశేవారు. కాలం మారుతున్న కొద్దీ ఈ స్త్రీ అన్ని రంగాలలోను అభివృద్ధిని సాధిస్తూ వచ్చింది. మగవాళ్ళతో సమానంగా ఇంకా చెప్పాలంటే అంతకు మించి ఎన్నో సాహసాలను చేస్తూ వచ్చింది. అటువంటి ఓ స్త్రీ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
బ్రెజిల్ కి చెందిన ఈ మహిళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఓ అద్భుతమైన సాహసంతో ఓ అరుదైన రికార్డుని సొంతం చేసుకుంది. ఆమె పేరు కరీనా ఒలియానా. ఈమె ఒక ప్రపంచ ప్రఖ్యాత వన్యప్రాణి సాహసి. సముద్రాలు, అడవులలో ఉండే సాధారణ వ్యక్తులు చేయలేని సాహసాలను చేస్తూ ఎన్నో రికార్డులను అందుకుంది. అయితే ఈమె ఇప్పుడొక భయంకరమై సాహసాన్ని చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుని పొందింది. అదేమిటంటే.. భూమి మీద ఎక్కువ ఉష్ణోగ్రతలు గలిగిన ప్రాంతాల్లో ఒకటైన వాల్కానిక్ లావా సరస్సుపై ప్రయాణించి ఈ రికార్డుని అందుకుంది. ఈ సరస్సు ఇథియోపియాలోని 1187 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత కలిగిన సరస్సు అది. దీనిపై ఆమె 100. 58 మీటర్లు ఒక తాడు సహాయంతో ప్రయాణించి, అత్యధిక దూరం ప్రయాణించిన మహిళగా గుర్తింపు పొందింది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలైంది.
దీనిపై ఆమె మాట్లాడుతూ… ఇలా లావాపై వెళ్లడం ఎంతో థ్రిల్లింగ్ గా ఉందని, ఇలా వెళ్లడమే కాకుండా గిన్నిస్ బుక్ రికార్డుని అందుకోవడం అనేది చాలా ఆనందాన్ని కలిగిస్తుందని తెలిపింది. ఇలాంటి స్త్రీలు ఇంకా ఎందరో ఈ భూమి మీద ఉన్నారు. అందుకే స్త్రీని తక్కువగా చూడవద్దని అనేది. మహిళ అడుగు పెట్టనంతవరకే.. ఒక్కసారి అడుగుపెట్టిందో.. ఇక చరిత్రే.