Friday, October 18, 2024

మీ ఇంట్లో అవి ఉంటే.. ప్రభుత్వం రేషన్ కార్డ్ లాగేసుకుంటుంది

Karnataka Ration Card: ఎలక్షన్లు వస్తున్నాయంటే చాలు వరాలు కురిపించే ప్రభుత్వాలు, ఎలక్షన్ల తర్వాత ప్రజలకు చుక్కలు చూపించేలా ప్లాన్ చేసుకుంటున్నాయి. ప్రజాస్వామ్యం అని చెప్పి.. ప్రజలు ఏర్పరచుకున్న ప్రభుత్వాలు.. ప్రజలనే ఇబ్బంది పెట్టేలా చేస్తుంటే ధిక్కేంటి అనేలా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మరీ కరుడు కట్టినట్లుగా ప్రవర్తిస్తున్నాయి. ముఖ్యంగా రైతులు ఒక వైపు ఎలా ఉద్యమాలు చేస్తున్నారో తెలియంది కాదు. ఇప్పుడు ఒక రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నియమాలు పెట్టి.. సామాన్యులకు రేషన్ కార్డు లేకుండా చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఏంటా నియమాలు, ఏ రాష్ట్రం అంత దుర్మార్గానికి ఒడిగడుతుంది అనేది తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ పూర్తిగా చదవాల్సిందే.

కర్ణాటక రాష్ట్రానికి చెందిన పౌరసరఫరాల శాఖ మంత్రి సోమవారం బెళగావిలో ఓ కీలక ప్రకటన చేశారు. రేషన్ కార్డు దారులకు ఐదు ఎకరాలకు మించి భూమి ఉన్నా, ఇంట్లో టీవీ, ఫ్రిజ్, టూ వీలర్ వీటిలో ఏవీ ఉన్నా సరే.. వెంటనే రేషన్ కార్డులను ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేయాలంటూ మంత్రి పత్రికా సమావేశంలో ప్రకటించారు. అంతేకాదు, వార్షిక ఆదాయం రూ. 1.20 లక్షలకు మంచి ఉండకూడదట. ఈ పైన చెప్పినవి ఏవీ ఉన్నా.. మార్చి 31లోగా అవి ఉన్నవారు రేషన్ కార్డులను తిరిగి ఇచ్చేయాలంటూ.. ‘శ్రీమంతుడు’ సినిమాలో మహేష్ బాబు చెప్పినట్లు ఓ ప్రకటన వదిలారు.

ఐదు ఎకరాలకు మించి భూమి ఉంటే అనే నియమం ఓకే గానీ, మరి టీవీ.. ఫ్రీజ్, టూ వీలర్ అని ప్రకటించడమే దారుణం అంటూ అక్కడి ప్రజలు ప్రభుత్వంపై కన్నెర్ర చేస్తున్నారు. అయినా ప్రజలకు ఏం కావాలో తెలుసుకుని తీర్చాల్సిన బాధ్యత ఉన్న ప్రభుత్వాలు.. అవి తీసేస్తాం, ఇవి తీసేస్తాం అంటూ ప్రకటించడం ఏమిటో?. ఈ కొత్త రూల్స్ అన్ని స్టేట్స్ ఫాలో అయినా.. పేదలు బ్రతుకు ఆగమ్యగోచరంగా మారడం ఖాయం. మరి కర్ణాటక ప్రభుత్వం ఈ విషయంలో ఏమైనా పునరాలోచిస్తుందో.. లేదో తెలియదు కానీ.. ప్రస్తుతానికైతే అక్కడి ప్రజలు మాత్రం ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్నారన్నది మాత్రం వాస్తవం.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

2,894FansLike
4,583FollowersFollow
8,907FollowersFollow
3,457FollowersFollow
2,267FollowersFollow
6,786SubscribersSubscribe
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x