Friday, April 4, 2025

ఈ యువతి కల తెలిస్తే షాకవ్వాల్సిందే.. ఏకంగా వందమంది కావాలట!

H‌undred Children: మనలో చాలా మందికి చాలా రకాల కలలు, కోరికలు ఉంటాయి. వాటిని నిజం చేసుకోవడానికి చాలా శ్రమ పడుతూ ఉంటాం. అయితే ఒక్కొక్కరికీ ఒక్కో రకం కోరికలు ఉంటాయి. ఎవరి కోరికలనూ, కలలనూ మనం తప్పు బట్టకూడదు. అయితే కొంత మందికి మాత్రం చాలా వింత, వినూత్నమైన కలలు ఉంటాయి. ఈ విషయాన్ని కూడా మనం కాదనలేం. ఇదిగో మనం ఇప్పుడు చెప్పుకోబోయే విషయం అలాంటి ఓ వ్యక్తిదే. ఆమె పేరు క్రిస్టీనా ఓజ్టర్.

రష్యాకు చెందిన క్రిస్టీనా… రాజధాని మాస్కోలో పుట్టింది. ఈమె ఓ కోటీశ్వరురాలు. ఇప్పటికే 11 మంది పిల్లలకు జన్మనిచ్చింది. ఇప్పుడు సరోగసీ విధానాన్ని ఉపయోగించుకొని మరింత మంది పిల్లలను కనాలని ప్లాన్ చేస్తోంది. దీని కోసం సరోగసీ తల్లుల సాయం తీసుకుంటోంది. ఇంతకీ క్రిస్టీనాకు ఈ పిల్లల పిచ్చేంటి? అని డౌట్ వస్తోంది కదూ? నిజమే ఆమెకు పిల్లలంటే చచ్చేంత ఇష్టం. అందుకే వయసు 23 ఏళ్లే అయినా ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంది. క్రిస్టీనా భర్త గల్లిప్ ఓజ్టర్క్ అత్యంత విలాసవంతమైన ఓ రెస్టారెంట్ యజమాని. ఈ దంపతులు ఇద్దరూ ప్రస్తుతం జార్జియాలో ఉంటున్నారు. ఇప్పటికి 11మందికి తల్లిగా మారిన క్రిస్టీనా.. స్వయంగా జన్మనిచ్చింది కేవలం ఒక బిడ్డకే, మిగతా 10 మంది పిల్లలూ సరోగసీ ద్వారా కన్నవారే. ఇప్పుడు ఈ దంపతులు మరింత మంది పిల్లలను కనాలని అనుకుంటున్నారు.

క్రిస్టీనాకు చిన్న పిల్లలు అంటే చాలా ఇష్టం. అందుకే ఆమె మరింత మంది పిల్లలకు తల్లి అవ్వాలని భావిస్తోంది. తమ దాంపత్య జీవితం గురించి ఓ సందర్భంలో మాట్లాడిన ఈ జంట తమ ప్రేమ కథను బయటపెట్టారు. తాను తొలిసారి గల్లిప్‌ను చూడగానే ప్రేమలో పడ్డానని, గల్లిప్ కూడా తనను తొలిచూపులోనే ప్రేమించాడని క్రిస్టీనా తెలిపింది. ఎప్పుడూ చెరగని చిరునవ్వుతో ఉండే క్రిస్టీనా అంటే తనకు ప్రాణమని గల్లిప్ అంటున్నాడు. వంద మంది పిల్లలకు తల్లి అవ్వాలనేది క్రిస్టీనా కల అని, దీన్ని నిజం చేయడం కోసం తాను ప్రయత్నిస్తున్నానని గల్లిప్ చెప్పాడు. సరోగేట్ విధానంలో పిల్లలను కనేందుకు ఒక్కో సరోగేట్ మదర్‌కు ఎనిమిది వేల యూరోలు (7 లక్షల రూపాయలపైగా) అందిస్తున్నారట ఈ జంట. సరోగేట్ మదర్ దగ్గర శిశువు కొన్నాళ్లు పెరిగాక, తాము వారిని తెచ్చుకుంటామని వివరించారు.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Most Voted
Newest Oldest
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

2,894FansLike
4,583FollowersFollow
8,907FollowersFollow
3,457FollowersFollow
2,267FollowersFollow
6,786SubscribersSubscribe
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x