Nandamuri Hero movie: టాలీవుడ్‌లో టాప్ నిర్మాణ సంస్థగా దూసుకుపోతోన్న మైత్రీ మూవీ మేకర్స్.. తమ బ్యానర్‌లో మరో చిత్రాన్ని ప్రారంభించుకుంది. ఇప్పటికే ‘ఉప్పెన’ వంటి సక్సెస్ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద హల్‌చల్ చేస్తున్న ఈ బ్యానర్ ఇప్పుడు నందమూరి కల్యాణ్ రామ్‌తో ఓ వైవిధ్యమైన చిత్రాన్ని ప్లాన్ చేసింది. ఒక్క కల్యాణ్ రామే కాదు.. మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహ బాలయ్య, సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్.. వంటి హీరోలతో కూడా తమ చిత్రాలు వరుసగా ఉండబోతున్నాయని ఇటీవల నిర్మాతలు ప్రకటించిన విషయం తెలిసిందే.
అందులో ముందు వరుసలో ఉన్న హీరో నందమూరి కల్యాణ్ రామ్ కథానాయకుడిగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై కొత్త చిత్రం సోమవారం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటిస్తోన్న 19వ చిత్రమిది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ ప్రొడక్షన్ నెం.14 గా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రం ద్వారా రాజేంద్ర దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మాతలు. ముహూర్తపు సన్నివేశానికి ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు సానా క్లాప్ కొట్టారు. దర్శకులు భరత్ కమ్మ, రాధాకృష్ణ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. హీరో కల్యాణ్ రామ్, నిర్మాత నవీన్ ఎర్నేని, సీఈఓ చెర్రీ .. చిత్ర దర్శకుడు రాజేంద్రకు స్క్రిప్ట్‌ను అందించారు. మార్చి రెండో వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. సినిమాలో హీరోయిన్ సహా ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే తెలియజేయనున్నారు.
నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రానికి సాంకేతిక నిపుణులు:
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎర్నేని అనిల్,
సీఈఓ: చెర్రీ,
నిర్మాతలు: నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్,
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రాజేంద్ర.