Friday, October 18, 2024

నా దారి నాదే.. రాజన్న రాజ్యం కోసం పార్టీ..

తెలంగాణలో మరో కొత్త పార్టీ వస్తోందని.. వైఎస్ ఫ్యామిలీ నుంచే పార్టీ పుట్టుకొస్తోందని.. గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున వార్తలు వెల్లువెత్తాయి. అయితే ఆ వార్తలన్నీ మంగళవారం (09/02/2021) నాటితో అక్షరాలా నిజమయ్యాయి. ముందుగా అనుకున్నట్లే.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల హైదరాబాద్‌లో వైఎస్ అభిమానులు, కార్యకర్తలు, అనుచరులతో ఆత్మీయ సమావేశమయ్యారు. అంతకుముందు బెంగళూరు నుంచి లోటస్‌పాండ్ వచ్చిన షర్మిలకు అభిమానులు భారీ ఫ్లెక్సీలు, పేపర్లతో పూలవర్షం కురిపించి ఘన స్వాగతం పలికారు.

అభిమానులకు అభివాదం చేస్తూ మీడియాతో రెండు మూడు మాటలే మాట్లాడిన షర్మిల.. నల్గొండ జిల్లాకు చెందిన అభిమానులు, నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వైఎస్సార్ హయాంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, అసలు తానేం చేయబోతున్నారు..? పార్టీ పెడితే ఎలా ఉంటుంది..? సొంతంగా పార్టీ పెట్టాలా..? లేకుంటే ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీనే తెలంగాణలో బలోపేతం చేసుకోవాలా..? అనే విషయాలను సమావేశంలో నిశితంగా చర్చించారు. ఈ సమావేశం జరుగుతున్నంత సేపు అటు లోటస్ పాండ్ లోపల.. బయట ‘జై షర్మిల.. జైజై షర్మిల.. జోహార్ వైఎస్సార్’ అంటూ నినాదాలు హోరెత్తాయి.

సమావేశానికి ముందు..!
వైఎస్సార్‌లేని లోటు తెలంగాణలో ఉందని.. అందుకే తెలంగాణలో రాజన్న రాజ్యం తేవాలన్నది తన కోరిక అని చెప్పుకొచ్చారు. తెలంగాణ పరిస్థితుల రీత్యా తాను ఎందుకు రాజకీయాల్లోకి రాకూడదు..? ఎందుకు పార్టీ పెట్టకూడదు..? అని మీడియానే ఆమె ప్రశ్నించారు. అందుకే రాజన్న రాజ్యం కోసం అన్ని జిల్లాల ప్రజల అభిప్రాయాలు తీసుకొని కచ్చితంగా పార్టీ పెడతామన్నట్లుగా చెప్పేశారు. అయితే అభిమానులకు చెప్పకుండా తాను పార్టీ పెట్టనని అందరితోనూ మాట్లాడే ఓ నిర్ణయం తీసుకుంటానన్నారు. మరోవైపు అభిమానులు కూడా.. ‘మాకు షర్మిళ – జగన్ రెండు కళ్ల లాంటి వాళ్ళు’ అని చెప్పారు. ప్రస్తుతం తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టాల్సి అవసరం ఎంతైనా ఉందని.. అక్క షర్మిల తీసుకునే నిర్ణయానికి తాము వందకు వంద శాతం సహకరిస్తామన్నారు. అంతటితో ఆగని అభిమానులు.. విజయ విహార్ నుంచి విజయాన్ని మొదలు పెట్టాలని సమావేశంలో భాగంగా షర్మిలకు సూచించారు.

జగన్‌తో విబేధాలపై..
వాస్తవానికి జగన్ పార్టీ పెడతారన్నది ఇప్పటి విషయం కాదు.. చాలా రోజులుగా దీని గురించే వైఎస్ ఫ్యామిలీలో చర్చ జరుగుతోంది. అయితే ఓ ప్రధాన దినపత్రికలో ఇందుకు సంబంధించి వార్తలు రావడంతో జగన్-షర్మిల మధ్య భిన్నాభిప్రాయాలు తలెత్తాయి. దీంతో పార్టీ ప్రకటిస్తున్నారన్న దానిపై షర్మిల అంతంత మాత్రమే ఖండిస్తూ ఓ ప్రకటనను విడుదల చేశారు. ఆ తర్వాత వైఎస్ ఫ్యామీలో ఎవరూ దీనిపై రియాక్ట్ అవ్వలేదు. షర్మిల కూడా ఆ ప్రకటన తర్వాత స్పందించలేదు. దీంతో ఇవాళ ఫస్ట్ టైమ్ జగనన్న గురించి మాట్లాడారు. జగన్ అన్నతో తనకు ఎలాంటి విభేదాల్లేవని స్పష్టం చేశారు. ‘ఏపీలో జగన్ అన్న ఆయన పని ఆయన చేసుకుంటున్నారు. నేను తెలంగాణలో నా పని నేను చూసుకుంటాను. నేను పార్టీ గురించి జగనన్నను సంప్రదించలేదు, చర్చించలేదు’ అని వెల్లడించారు. అంతేకాదు.. తెలంగాణలో వైసీపీ విభాగంతో కలిసి ముందుకెళ్తానని ప్రకటించారు. త్వరలో పాదయాత్ర కూడా ఉంటుందని.. ఎన్ని చేసినా ఏపీలో ఆయన పనే ఆయనదే.. తెలంగాణలో తన పని తనదేనని స్వయంగా వైఎస్ షర్మిలనే ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే తాను ఇక్కడ పార్టీ పెడితే మాత్రం ఏపీ రాజకీయాల్లో వేలు పెట్టనని.. తెలంగాణకు మాత్రమే పరిమితం అవుతానని కీలక ప్రకటన చేశారు.

ప్రకటన అప్పుడేనా..!?
ప్రస్తుతం జిల్లాల వారిగా సమావేశాలు నిర్వహించి అందరి అభిప్రాయాలను స్వీకరించి ఆ తర్వాత భారీ బహిరంగ సభ పెట్టి మరీ కీలక ప్రకటన చేయాలని షర్మిల భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆమె పార్టీ పేరు.. స్థాపన, పాదయాత్ర గురించి కూడా చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే కొందరు మాత్రం ఇప్పటికే పార్టీ రిజిస్ట్రేషన్ కూడా అయ్యిందని అంటుంటే.. ఇంకొందరు మాత్రం వైసీపీనే ఇక్కడ కూడా కొనసాగిస్తారా..? అని అనుకున్నారు. కానీ ఈ విషయాలపై షర్మిల ఎలాంటి ప్రకటన చేయలేదు కానీ.. పరోక్షంగా మాత్రం పార్టీ పెడుతున్నట్లే చెప్పారు. ఇవాళ జరిగిన ఆత్మీయ సమ్మేళనం లాగే అన్ని జిల్లాల కార్యకర్తలు, నేతలు, అభిమానులతో ఆమె సమావేశమవుతారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే మార్చిలో పార్టీ ప్రకటన ఉంటుందని.. పాదయాత్ర కూడా ఉంటుందని తెలుస్తోంది. మరి షర్మిల ఇప్పుడున్న పార్టీలన్నింటి మధ్య ఎలా ముందుకెళ్తారో..? పార్టీని ఎలా బలోపేతం చేస్తారా..?.. ఎప్పుడు అధికారంలోకి వచ్చి ‘రాజన్న రాజ్యం’ తెస్తారో వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి

షర్మిల కొత్త పార్టీ పెడతారా.. వైసీపీతోనే ముందుకెళ్తారా?

జగన్-షర్మిల మధ్య విభేదాలు నిజమే.. భారతీకి కూడా!

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

2,894FansLike
4,583FollowersFollow
8,907FollowersFollow
3,457FollowersFollow
2,267FollowersFollow
6,786SubscribersSubscribe
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x