Friday, October 18, 2024

జగన్ నచ్చజెప్పినా వినకుండా గీత దాటిన షర్మిల!

హెడ్డింగ్ చూడగానే అవునా.. అని ఆశ్చర్యపోతున్నారు కదూ.. అవును మీరు వింటున్నది నిజమే. ఈ మాటలు అన్నది ఎవరో కాదండోయ్.. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబానికి అత్యంత ఆప్తుడు, జగన్ సర్కార్‌కు రాజకీయ సలహాదారు.. సజ్జల రామకృష్ణారెడ్డి. గత కొన్నిరోజులుగా షర్మిల పార్టీ స్థాపించబోతున్నారనే వార్తలు మంగళవారం నాడు అక్షరాలా నిజమయ్యాయి. అనుకున్నట్లే ఇవాళ హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో వైఎస్ వీరాభిమానులు, కార్యకర్తలు, అనుచరులతో షర్మిల భేటీ అయ్యారు.

ఇవాళ నల్గొండ జిల్లాకు చెందిన కార్యకర్తలు, నేతలు హాజరవ్వగా.. ఇకపై ప్రతి వారం ఇదే లోటస్‌పాండ్‌లో భేటీ అవ్వడమా..? లేదా.. జిల్లాల వారిగా పర్యటించి అభిప్రాయాలను తీసుకోవాలా..? అనేదానిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని షర్మిల ప్రకటించారు. అయితే.. ఇంతవరకూ ఈ పార్టీ విషయమై, జగన్-షర్మిల మధ్య విభేదాలపై స్పందించని వైసీపీ ఫస్ట్ టైమ్ స్పందించింది. ఓ వైపు షర్మిల సమావేశం నిర్వహిస్తుండగానే.. అమరావతిలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో సజ్జల మీడియా మీట్ నిర్వహించి అన్ని విషయాలను నిశితంగా వివరించారు.

జగన్ నచ్చజెప్పినా..!
షర్మిల నిర్ణయం ఆమె వ్యక్తిగతం. తెలంగాణ రాజకీయాలపై సీఎం జగన్‌ మోహన్ రెడ్డి స్పష్టమైన వైఖరితో ఉన్నారు. వైసీపీ పదేళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత జగన్‌ అధికారంలోకి వచ్చారు. రెండు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకోవాలన్నదే ఆయన ఆలోచన. వైఎస్‌ షర్మిల పరిచయం తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితమే. ప్రస్తుత పరిణామాలపై తప్పుడు భాష్యం వచ్చే అవకాశముంది. రాజకీయ సిద్ధాంతంపై భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. కానీ అన్నా చెల్లెళ్ల మధ్య ఎలాంటి విభేదాలు లేవు. తెలంగాణలో పార్టీ వద్దని ఒక స్థిరమైన అభిప్రాయంతో జగన్‌ ఉన్నారు. షర్మిల మాత్రం పాదయాత్ర చేసి, పార్టీ పెట్టాలన్నట్టు కనిపిస్తున్నారు. తండ్రి స్పూర్తితో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్‌ రాష్ట్రానికి జవాబుదారీ. షర్మిల తీసుకున్న నిర్ణయం ఆమె సొంత నిర్ణయం. వైసీపీనీ తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమని భావించాం. తెలంగాణలో పార్టీ వద్దని సీఎం జగన్‌ సూచించారు. తెలంగాణలోకి వెళ్లాలన్న ఆలోచన పార్టీకి ఏ మాత్రం లేదు. ఇలాంటి భిన్నాభిప్రాయాలే కానీ విభేదాలు కావు అని సజ్జల చెప్పుకొచ్చారు.

వైసీపీకి సంబంధమే లేదు..!
మూడు నెలలుగా షర్మిల పార్టీ ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలంగాణలో పార్టీ పెట్టవద్దు అన్నది జగన్ అభిప్రాయం. పార్టీ పెట్టడం వల్ల ఉండే ఇబ్బందులు కూడా ఆమెకు చెప్పటం జరిగింది. రాజశేఖరరెడ్డి మార్గదర్శకత్వంలో ఆమె పార్టీ పెట్టాలనుకుంటున్నారు. షర్మిల పార్టీతో వైసీపీ కి సంబంధం లేదు. తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేసే అంశం మీద షర్మిల కూడా ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. షర్మిల సొంతంగా ఓ ప్రయత్నం చేయాలనుకుంటున్నారు. షర్మిల గురించి తెలియదంటే బుకాయించినఅట్లే అవుతుంది.

రాష్ట్ర విభజన నుంచి తెలంగాణలో పార్టీ వైఖరిపై అనేక ప్రశ్నలు వస్తూనే ఉన్నాయి. అయితే జగన్ మాత్రం ఒకే వైఖరితో ఉన్నారు. విభజన తర్వాత రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పని చేసుకోవాలని తెలంగాణ వెళ్ళే ప్రయత్నం చేసినా గ్యాప్ వస్తుందని జగన్ భావించారు. అందుకే తెలంగాణలో పార్టీ కార్యకలాపాలు వద్దని జగన్ అనుకున్నారు. తెలంగాణలో రాజకీయాలు చేస్తే మన రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయని జగన్ భావించారు. అయితే.. ఏపీలో జరుగుతున్న అభివృద్ధి తెలంగాణలో ఎందుకు జరగకూడదు..? అనేది షర్మిల ఆలోచన అని సజ్జల చెప్పుకొచ్చారు.

మొత్తానికి చూస్తే.. జగనన్న వదిలిన బాణమైన షర్మిల సొంత ఫ్యామిలీతో విభేదిస్తోందని సజ్జల వ్యాఖ్యలతో స్పష్టంగా అర్థమవుతోంది. అయితే షర్మిల ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు గనుక.. ఫైనల్‌గా ఏం జరుగుతుందో అనేది పైనున్న పెరుమాళ్లకే ఎరుక. ఇవాళ ఒకే ఒక్క జిల్లాకు చెందిన అభిమానులతో సమావేశమైన షర్మిల అన్ని జిల్లాల కార్యకర్తలు, అభిమానులతో సమావేశమైతే పరిస్థితి ఏంటన్నది తెలుస్తుంది. అన్నీ జిల్లాలు తిరిగాక అసలు పార్టీ పెట్టాలా..? వద్దా..? అన్నది నిర్ణయం తీసుకుంటారేమో. ఫైనల్‌గా ఏం జరుగుతుందో..? షర్మిల ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో..? ఒకవేళ పార్టీ పెడితే ఏ మాత్రం ఆదరణ వస్తుందో..? వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి:

* షర్మిల కొత్త పార్టీ పెడతారా.. వైసీపీతోనే ముందుకెళ్తారా!?
*జగన్-షర్మిల మధ్య విభేదాలు నిజమే.. భారతీకి కూడా!
*నా దారి నాదే.. రాజన్న రాజ్యం కోసం పార్టీ..

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

2,894FansLike
4,583FollowersFollow
8,907FollowersFollow
3,457FollowersFollow
2,267FollowersFollow
6,786SubscribersSubscribe
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x